Tata Nexon: ఎస్‌యూవీ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేంది టాటా మోటార్స్ కంపెనీ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దేశంలో అత్యదికంగా విక్రయమౌతున్న ఎస్‌‌యూవీ టాటా మోటార్స్ కంపెనీదే. టాటా నెక్సాన్ ఇందులో ప్రత్యేకం. అద్భుతమైన ఫీచర్లు, తక్కువ ధర ఉండటమే ఇందుకు ఉదాహరణ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో మూడవ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్. మారుతి సుజుకి మొదటి స్థానంలో ఉంటే హ్యుండయ్ రెండవ స్థానంలో ఉంది. అయితే ఎస్‌యూవీ విభాగంలో టాటా మోటార్స్‌దే అగ్రస్థానం. ఈ విభాగంలో టాటా మోటార్స్‌కు చెందిన టాటా నెక్సాన్ ఎక్కువగా అమ్ముడౌతోంది. టాటా నెక్సాన్ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ రెండింట్లోనూ అందుబాటులో ఉండటమే కాకుండా ధర కూడా 10 లక్షల కంటే తక్కువే కావడం విశేషం. మీరు కూడా టాటా నెక్సాన్ కొనుగోలుకు ప్రయత్నిస్తుంటే..ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేస్తాం.


టాటా నెక్సాన్ ధర 7.80 లక్షల నుంచి 14.50 లక్షల వరకూ ఉంటుంది. ఇది ఢిల్లీ ఎక్స్ షోరూం ధర. ఈ కారు మొత్తం 8 వేరియంట్లలో లభ్యమౌతోంది. ఇందులో అత్యధికంగా 5 మంది ప్రయాణించగలరు. మీ బడ్జెట్ ఇందుకు సహకరించకపోతే రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టాటా నెక్సాన్ బేసిక్ వేరియంట్ కొనుగోలు చేయాలంచటే ఆన్ రోడ్ ధర 8.85 లక్షల రూపాయలుంది. ఇందులో 10 శాతం డౌన్ పేమెంట్ అంటే 90 వేలు చెల్లించి ఈ కారును మీరు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన నగదుపై ఈఎంఐ ఎంత పడుతుంది, వడ్డీ రూపంలో ఎంత చెల్లించాల్సి వస్తుందనే వివరాలు పరిశీలిద్దాం..


మార్కెట్‌లో ఒక్కో బ్యాంకు వడ్డీ, కాల పరిమితి ఒక్కోలా ఉంటుంది. ఒకవేల పది సాతం డౌన్‌పేమెంట్ చెల్లించి 9.8 సాతం వడ్డీపై 5 ఏళ్ల కాల వ్యవధికి తీసుకుంటే..ప్రతి నెలా 16,845 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. అంటే మొత్తం లోన్ 9,09,374 రూపాయలుంటుంది. ఇందులో వడ్డీ రూపంలో 5 ఏళ్లకు మీరు చెల్లించేది 1,.01,082 రూపాయలు మాత్రమే. అంటే ఐదేళ్లలో 10,10,456 రూపాయలు అవుతుంది.


అయితే ఇక్కడ బ్యాంకు లోన్ పై వడ్డీ ఎంత అనేది మీరు తీసున్న లోన్, కాల పరిమితి, బ్యాంకును బట్టి మారవచ్చు. అందుకే కారు లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల్ని సంప్రదించి ఏ బ్యాంకు ఎంత ఆఫర్ చేస్తుందో పరిశీలించుకోవాలి. ఇక్కడ మేమిచ్చిన ఈఎంఐ వివరాలు ఉదాహరణ మాత్రమే. బ్యాంకుని బట్టి మారవచ్చు. ఎందుకంటే కారు లోన్లపై ఒక్కో బ్యాంకు వడ్డీ ఒక్కోలా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం 90 వేలు చెల్లించి మీకిష్టమైన టాటా నెక్సాన్ ఇంటికి తీసుకెళ్లండి.


Also read: Best Saving Schemes: మీ పిల్లలకు భవిష్యత్‌కు ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ ఐదు తప్పులు అస్సలు చేయకండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook