Tata Play 49 Plan: టాటా ప్లే DTH బంపర్ ఆఫర్.. రూ.49లకే ప్రముఖ OTTల సబ్‌స్క్రిప్షన్!
Tata Play 49 Plan: ప్రముఖ DTH కంపెనీ టాటా ప్లే ఇటీవల ఒక కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ. 49లకే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ ల సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా పొందే సదుపాయాన్ని కల్పించింది.
Tata Play 49 Plan: దేశంలోని ప్రసిద్ధ DTH కంపెనీ టాటా స్కై (Tata Sky) ఇప్పుడు టాటా ప్లేగా పేరు మార్చుకుంది. పేరు మార్చుకోవడంతో పాటు కస్టమర్లకు సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే వారిని దృష్టిలో ఉంచుకొని ఇటీవలే ఓ ప్రత్యేక ఆఫర్ ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 49 ధరకే అనేక OTT సబ్‌స్క్రిప్షన్ ను ఇవ్వనుంది. దాని పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం.
టాటా ప్లే కొత్త ప్లాన్
టాటా ప్లే ప్రవేశపెట్టిన అతి చౌకైన ప్లాన్ రూ. 49 ధరకే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా ప్రముఖ OTT ప్లాట్ ఫారమ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఇస్తుంది. ఈ ప్లాన్ లో 7 రోజుల పాటు ఉచిత ట్రయల్ అందించబడుతుండగా.. 30 రోజుల వ్యాలిడిటీతో కస్టమర్లకు అందుబాటులో ఉంది.
ఈ ప్లాన్ ప్రయోజనాలు
ఈ ప్లాన్‌లో ఏ OTT ప్లాట్‌ఫారమ్‌ల ప్రయోజనాలు ఉంటాయో అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే రూ. 49 ప్లాన్‌లో మీరు హంగామా (Hungama), ఈరోస్ నౌ (Eros Now), షెమరూ-మీ (Shemaaro me), జీ5 (Zee5) ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఈ యాప్ లలోని కంటెంట్ ను ఉచితంగా చూసేందుకు టాటా ప్లే వినియోగదారులకు అవకాశం ఉంది. ఈ ప్లాన్ మూడు డివైస్ లో ఒకేసారి పనిచేస్తుంది.
ఈ ప్లాన్ కొనేముందు ఇవి గుర్తుంచుకోండి!
ఈ ప్లాన్ చాలా చౌకైనది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే దీన్ని కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. ఈ ప్లాన్ యొక్క వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో OTT యాప్‌ల కంటెంట్‌ను మాత్రమే చూడగలరు. వీటిని టీవీలో ప్రసారం చేసుకునేందుకు వీలు లేదు. ఈ ప్లాన్ ను మీరు వినియోగించుకోవాలంటే.. మీరు తప్పనిసరిగా టాటా ప్లే బింగే యాప్, యాక్టివ్ DTH కనెక్షన్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ ప్లాన్ ప్రత్యేకంగా టాటా ప్లే వినియోగదారుల కోసం మాత్రమే.
Also Read: Virtual Reality: రూ.800 ఖర్చుతో ఇంట్లోనే 3D సినిమాలను చూసేయోచ్చు.. అదెలాగో తెలుసా?
Also Read: Flipkart Moto G22: ఫ్లిప్ కార్ట్ లో రూ.549 లకే Moto G22 స్మార్ట్ ఫోన్ అమ్మకం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook