Tata Tiago Car Sales: కార్ల అమ్మకాల్లో రెండో స్థానం కోసం హ్యూందాయ్ కార్లతో టాటా మోటార్స్ సంస్థ ఎప్పటి నుంచో పోటీపడుతున్న విషయం తెలిసిందే. ప్రతీ నెల హ్యూందాయ్, టాటా మధ్యే ఈ పోటీ నెలకొంటోంది. టాటా మోటార్స్ ఎప్పటి నుంచి అయితే తమ కార్లను రీడిజైన్ చేసి సరికొత్త ఫీచర్స్, న్యూ లుక్‌తో లాంచ్ చేశాయో.. అప్పటి నుంచే టాటా మోటార్స్ సేల్స్ రేసులో దూసుకుపోతోంది. ఇక ఈ పోటీలో టాటాను రేసులో నిలబెట్టడంలో టాటా టియాగో కారు కీలక పాత్ర పోషిస్తోంది. అందుకు సాక్ష్యం గతేడాది జనవరిలో టాటా టియాగో విక్రయాలతో పోల్చితే.. ఈ ఏడాది జనవరిలో టాటా టియాగో కార్ల విక్రయాల్లో 74 శాతం వృద్ధి కనపడటం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవును, 2022 జనవరిలో 5,195 టియాగో కార్లు అమ్ముడుపోగా.. ఈ 2023 జనవరి నెలలో ఆ సంఖ్య 9,032 కి ఎగబాకింది. అంటే 74 శాతం ఎక్కువ కార్లు అమ్ముడయ్యాయన్న మాట. టాటా మోటార్స్ తయారు చేసే కార్లపై సహజంగానే సేఫ్టీ ఫీచర్స్ పరంగా కస్టమర్లకు కొంత ఎక్కువ విశ్వాసం ఉండటం ఇందుకు ఓ కారణమైతే.. హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఇదే ఎంట్రీ లెవెల్ కారు.. అంటే తక్కువ ధరలో లభించే కారు కావడం ఈ సేల్స్ పెరగడానికి మరో కారణం కావచ్చు. 


ఇదిలావుంటే, ఈ హ్యాచ్ బ్యాక్ కార్లు ఇంత ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నప్పటికీ.. టాటా కార్లలో టియాగో స్థానం మూడో ర్యాంకులో ఉంది. అధికంగా అమ్ముడవుతున్న టాటా కార్లలో మొదటి స్థానం టాటా నెక్సాన్ కార్లది కాగా రెండో స్థానంలో టాటా పంచ్ కారు ఉన్నాయి.  


టాటా నెక్సాన్, టాటా పంచ్, టాటా టియాగో కార్ల విక్రయాలు సంగతి ఇలా ఉంటే.. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది టాటా హ్యారియర్, టాటా సఫారి కార్ల అమ్మకాల్లో డౌన్‌ఫాల్ కనిపించింది. 2022 జనవరిలో 2,702 టాటా హ్యారియర్ కార్లు అమ్ముడు పోగా.. ఈ ఏడాది జనవరిలో ఆ సంఖ్య 1,572 కే పరిమితమైంది. అంటే 42 శాతం సేల్స్ పడిపోయాయి. ఇక సఫారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది జనవరి నెలలో 1,563 టాటా సఫారి కార్లు అమ్ముడయ్యాయి. కానీ ఈ ఏడాది 1,032 టాటా సఫారి కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. టాటా సఫారీ కార్ల విక్రయాలు 34 శాతం పడిపోయాయి. 


మొత్తానికి టాటా కార్ల సేల్స్ రిజిస్టర్‌ని పరిశీలిస్తే.. టాటా ఎస్‌యువి సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్, టాటా కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్‌లో టాటా పంచ్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతుండగా.. టాటా హ్యాచ్‌బ్యాక్ కార్లలో టాటా టియాగో కారు ముందు వరుసలో ఉన్నాయి. టాటా కార్లను కొనడానికి ఆసక్తి చూపించే వారికి ఈ సమాచారం ఎంతో ఉపకరిస్తుంది కదూ. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్తగా లాంచ్ అవుతున్న కార్లు, కార్లపై ఆఫర్స్, ఏ కారుకు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, చీప్ అండ్ బెస్ట్ కారు ఏదీ, చీప్ అండ్ సేఫ్టీ కారు ఏది.. కారు మెయింటెనెన్స్‌లో ముఖ్యమైన విషయాలు ఏంటి.. ఇలా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారం ఏదైనా.. ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మీ జీ తెలుగు న్యూస్. కీప్ రీడింగ్ జీ తెలుగు న్యూస్.


ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు


ఇది కూడా చదవండి : Hyundai verna 2023: కేవలం రూ. 25 వేలు చెల్లించి కొత్త హ్యూందాయ్ కారు బుక్ చేసుకోండి


ఇది కూడా చదవండి : Best Selling Hatchbacks Cars: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook