TCS Share Results: టీసీఎస్ షేర్ హోల్డర్లకు గుడ్‌న్యూస్, డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
TCS Share Results: దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ లాభాల్లో దూసుకుపోతోంది. అందుకే టీసీఎస్ కంపెనీ ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటించింది. మరోవైపు త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది.
టీసీఎస్ కంపెనీ షేర్ హోల్డర్లకు గుడ్‌న్యూస్. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ షేర్లు మీ వద్ద ఉన్నాయా..ఉంటే మీరు ఊహించని లాభం చేకూరుతుంది. కంపెనీ షేర్ హోల్డర్లకు డివిడెండ్ ఇస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టీస్ సర్వీసెస్ స్థూలంగా చెప్పాలంటే టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2022-23కు సంబంధించి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ లాభం 8.4 శాత పెరిగి 10,431 కోట్లకు చేరుకుంది. దాంతో కంపెనీ షేర్ హోల్డర్లకు డివిడెండ్ ప్రకటించింది.
18 శాతం పెరిగిన ఆదాయం
సేవల ద్వారా కంపెనీ మొత్తం ఆదాయం ప్రస్తుత త్రైమాసికంలో 18 శాతం పెరిగి 53, 309 కోట్లకు చేరుకుందని టాటా గ్రూప్‌కు చెందిన టీసీఎస్ తెలిపింది. టీసీఎస్ ఆదాయం ఒక ఏడాది క్రితం 2021-22 జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో 46, 867 కోట్లుగా ఉంది. అంటే గత ఏడాదితో పోలిస్తే 9,624 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అదే సమయంలో టీసీఎస్ నిర్వహణ వ్యయం 1.24 శాతం తగ్గి 24 శాతమైంది.
షేర్ క 8 రూపాయలు డివిడెండ్
టీసీఎస్ కంపెనీ తన షేర్ హోల్డర్లకు డివిడెండ్ ప్రకటించింది. ప్రతి షేర్‌కు 8 రూపాయల చొప్పున డివిడెండ్ ప్రకటించింది. మరోవైపు టీసీఎస్ కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికంలో అక్షరాలా 9,840 మందికి ఉద్యోగాలు కల్పించింది. దాంతో సిబ్భంది సంఖ్య 6.16 లక్షలైంది. ఈ విషయంలో ఐటీ రంగంలో అతిపెద్ద రిక్రూటర్‌గా మారింది. టీసీఎస్ షేర్ బీఎస్ఈలో 1.84 శాతం పెరిగి 3,121.20 రూపాయలైంది.
Also read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook