Tech Mahindra: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి దేశంలోనే తిరుగు లేదని మరోసారి ప్రూవ్ అవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ నగరం తో చూసినప్పటికీ హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ పరంగా ముందంజలో ఉందని ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను బట్టి తెలుసుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భూములు ప్లాట్లు ధరలు ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాలను తలదన్నేలా పెరుగుతున్నాయి. గత సంవత్సరం కోకాపేటలో జరిగిన వేలంపాటలో ఎకరం 100 కోట్లకు పైగా అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా వందల కోట్ల డీల్స్ హైదరాబాదులో జరిగాయి. ఇక్కడి భూముల విలువలు దేశంలోనే చాలా స్పీడ్ గా పెరుగుతున్నాయని చెప్పవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ భూమి కాస్త తగ్గిందనే వార్తలు విన్నప్పటికీ అదేమీ తగ్గలేదని ఈ మధ్యకాలంలో జరిగిన డీల్స్ ని బట్టి తెలుసుకోవచ్చు. తాజాగా ఒక భారీ డీల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తాను మరింత పెంచిందని చెప్పవచ్చు. హైదరాబాద్ గండి మైసమ్మ ప్రాంతంలోని బహుదూర్ పల్లి లో ఉన్న 13 ఎకరాల భూమిని టెక్ మహీంద్రా సంస్థ విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ డీల్ విలువ దాదాపు 500 కోట్ల పైనే అన్న సంగతి తెలుస్తోంది. ఇందులో మొత్తం 17 బిల్డింగ్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ డీల్ మహీంద్రా  తన సొంత యూనివర్సిటీతోనే కుదుర్చుకోవడం విశేషం.


మహీంద్రా యూనివర్సిటీని మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థని ఏర్పాటు చేసినప్పటికీ, ఈ యూనివర్సిటీ పూర్తిగా స్వయంప్రతిపత సంస్థగా నిలిచింది. ఈ నేపథ్యంలో తమ యూనివర్సిటీకి టెక్ మహీంద్రా సంస్థ 103 ఎకరాల స్థలాన్ని విక్రయిస్తోంది. ఒక్కో ఎకరం ఐదు కోట్ల రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు టెక్ మహీంద్రా సంస్థ ఇటీవల స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో కంపెనీ షేర్లు కూడా పెరిగాయి. ప్రైవేట్ యూనివర్సిటీగా పేరు సంపాదించుకున్న మహీంద్రా  యూనివర్సిటీ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున విస్తరించనుంది. ఈ డీల్ ద్వారా యూనివర్సిటీ కి 1.26 మిలియన్ చదరపు అడుగుల స్థలం కలిసి వస్తుంది. తద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో యూనివర్సిటీ అభివృద్ధి జరగనుంది.


 




Also Read : NPS New Rule: ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్.. NPS కొత్త రూల్.. పెన్షన్‌లో 40 శాతం పెంపు..!


ఇదిలా ఉంటే బ్రాండ్ హైదరాబాద్ ఏమాత్రం చెక్కుచెదరలేదని హైదరాబాద్ నలువైపు నా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఎయిర్పోర్ట్ సమీపంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనున్నట్లు ప్రకటించింది. దీనికి తోడు రీజినల్ రింగ్ రోడ్డు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు మొత్తం తెలంగాణకు సైతం భూముల వ్యాల్యూలు పెంచేందుకు తోడ్పడుతోంది.


ఇదిలా ఉంటే హైదరాబాదులో వెస్ట్ సైడ్ రియల్ ఎస్టేట్ రంగం చాలాకాలంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోకాపేట, శంకర్పల్లి నార్సింగి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం భారీగా విస్తరిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా రియల్ ఎస్టేట్ భారీగా పొంచుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ అదే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట పలు ప్రాజెక్టులను చేపట్టింది. దీనికి తోడు మెట్రో సైతం ఈ ప్రాంతానికి కనెక్టివిటీ ఇవ్వనున్న నేపథ్యంలో భారీగా ఇక్కడ భూముల విలువలు పెరిగేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే విజయవాడ హైవే బెంగళూరు హైవే రాజీవ్ రహదారి వెంట కూడా భూముల రేట్లు భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.


Also Read :Aadhaar Card Updates: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జెండర్ ఎన్ని సార్లు ఎలా మార్చాలి


 


 



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి