ఇంతకాలం వ్యాపారానికే పరిమితమైన ఎలాన్ మస్క్‌ కు పట్టిందల్లా బంగారం అయింది.  ఏ వ్యాపారం చేపట్టినా అప్రతిహతంగా సంపదను పోగు చేసుకున్నాడు. అలాంటి ఆయనకు కూడా కష్టాలు తప్పడం లేదు. మీడియాలోకి రాగానే ఆయనకు నష్టాల పరంపరం ప్రారంభమయ్యాయి. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వెంటనే టెస్లా షేర్ల విలువ అమెరికా ఎక్స్ఛేంజీల్లో ఏకంగా 12 శాతం పడిపోయింది.  ట్విట్టర్ ను కొనుగోలు చేయాలని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్న మస్క్... నిధులు సమకూర్చుకునేందుకు టెస్లా లో తనకు ఉన్న వాటాను అమ్ముకున్నారనే ప్రచారం జోరుగా సాగడంతో షేర్ల విలువ ఒక్కసారి పడిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్విట్టర్ మీద మోజు పెంచుకున్న మస్క్ ... అవసరం అయితే టెస్లాను తెగనమ్ముతారనే ప్రచారం కూడా జోరుగా సాగడంతో షేర్ హోల్డర్లు ముందు జాగ్రత్త చర్యగా తమ షేర్లను అమ్మేసుకున్నారు.  ట్విటర్‌లో తాను వాటాలు కొనుగోలు చేశానని మస్క్‌ ప్రకటించినప్పటి నుంచి టెస్లాకు బ్యాండ్ టైం స్టాట్ అయింది. అప్పటి వరకు జోరు మీదున్న మార్కెట్ విలువ ఒక్కసారిగా 275 బిలియన్‌ డాలర్లు తగ్గిపోయింది. టెస్లా షేరు విలువ పతనం కావడంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కేవలం ఒక్కరోజులోనే 126 బిలియన్‌ డాలర్లు తగ్గిపోయింది. 


ఎలన్ మస్క్ మనసు వ్యాపారం పై నుంచి మీడియాపైకి రావడంతో ఇన్వెస్టర్లను ఆయనపై అపనమ్మకాన్ని పెంచుకున్నారు. చక్కగా వ్యాపారం చేసుకోవాల్సిన ఆయనకు సోషల్ మీడియాలోకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని తప్పుపట్టారు. ఆయా దేశాల రాజకీయాల్లో ట్విట్టర్ పరోక్షంగా జోక్యం చేసుకుంటోందనే వార్తలు కూడా షేర్ హోల్డర్లను కలవర పెట్టాయి. ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఊహకుకూడా అందని విధంగా సమస్యలు వచ్చి టెస్లాకు నష్టాలు వస్తాయో అని భావిస్తున్న ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్ముకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. 


టెస్లా షేర్ల పతనానికి మిగతా  కారణాలు కూడా లేకపోలేదు. అమెరికాలో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం కూడా మరో ప్రధాన కారణని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంత ఇంత జరుగుతున్నా మస్క్‌ మాత్రం ఇప్పటి వరకు తన వాటా కోసం వెచ్చించిన 21 బిలియన్ డాలర్లను ఎలా సమకూర్చుకోనున్నారో బహిర్గతం చేయడం లేదు. దీంతో టెస్లా షేర్లను అమ్ముకొనే నిధులు సమకూర్చుకున్నాడనే వార్తలు జోరందుకున్నాయి. దీంతో టెస్లా షేర్ల పతనం ప్రారంభమయ్యాయి. 


also read


Adani Group new business సిమెంట్ రంగంలోకి రానున్న అదానీ గ్రూప్


Flipkart Month End Mobile Fest: 5 వేల బడ్జెట్‌లో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.