EV Cars: ఎప్పుడెప్పుడా అని నెలల తరబడి నిరీక్షణ అనంతరం బ్రిటన్‌కు చెందిన ప్రముక కార్ల కంపెనీ మిని ఈవీ కార్లను అందుబాటులో తీసుకొచ్చింది. మిని కంపెనీ నుంచి కొత్తగా 2025 కూపర్ ఇ, కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిని కంపెనీ కార్ల ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్, త్రీ డోర్ మోడల్ అనేది ఈవీ రంగంలో సరికొత్తగా కన్పించనుంది. మినీ కూపర్ ఇ, మిని కూపర్ ఎస్ఈ హ్యాచ్‌బ్యాక్ కార్ల ధర ఎంతనేది ఇంకా వెల్లడి కాలేదు. మిని 2025 కూపర్ లైనప్‌లో చాలా కీలకమైన మార్పులు కన్పించాయి. ఈ మార్పులు డ్రైవింగ్ సామర్ధ్యాన్ని, ఇంటీరియర్ స్పేస్‌ను కచ్చితంగా పెంచుతున్నాయి.


మిని కూపర్ ఇ, మిని కూపర్ ఎస్ఈ రెండు కార్లు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోడల్స్ కావడం గమనార్హం. త్వరలో ఇందులోనే ఫోర్ వీల్ డ్రైవ్ ప్రవేశపెట్టవచ్చు. ఈ రెండు మోడల్ కార్లలో 16 లేదా 18 ఇంచెస్ రిమ్ ఆప్షన్లు ఉన్నాయి.కొత్త మిని కూపర్‌లో సస్పెన్షన్ సామర్ధ్యం పెంచడం, వైడర్ ట్రాక్ విడ్త్ ఉన్నాయి. కొత్త డిజైన్ లుక్ కూడా అద్భుతంగా రాయల్‌గా ఉంది. 


మిని 2025 కూపర్ ఇ సామర్ద్యం, పవర్


ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో ఉంటుంది. 184 హెచ్‌పి పవర్, 290 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 40.7 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఫుల్‌ఛార్జ్‌తో 305 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది 75 కిలోవాట్స్ వరకూ సపోర్ట్ చేస్తుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.3 సెకన్లలో అందుకోగలదు.


మిని కూపర్ ఎస్ఈ రేంజ్, పవర్


ఇది కూడా సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. 218 హెచ్‌‌పి పవర్, 330 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 54.2 కిలోవాట్స్ బ్యాటరీ కలిగి ఉంటుంది. దీనిని 95 కిలోవాట్ వరకూ పెంచవచ్చు. కేవలం అరగంట వ్యవధిలో 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ అయితే 402 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 0-100 కిలోమీటర్ల వేగం అందుకునేందుకు కేవలం 6.7 సెకన్ల సమయం తీసుకుంటుంది.


Also read: Jio AirFiber Launch: వినాయక చవితి కానుకగా జియో ఎయిర్ ఫైబర్ లాంచ్‌కు అంతా సిద్ధం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook