Best Government Savings Schemes in India:  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పొదుపు చాలా ముఖ్యం. ప్రతినెలా కొంచెం పొదుపు చేస్తే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ప్రపంచ సేవింగ్స్ డే రోజు మన దేశంలో ఉన్న టాప్ 10 స్కీముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


1. ఫిక్స్డ్ డిపాజిట్లు: 


ఎలాంటి నష్టభయం లేకుండా..మంచి రాబడులు సంపాదించాలంటే ఆశించేవారికి ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు మంచి అవకాశం. ఇన్ కం ట్యాక్స్ రూల్ సెక్షన్ 80 సీ కింద ఫిక్స్డ్ డిపాజిట్లపై రూ. 1.5లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. 


2. యులిప్ 


బీమా, పెట్టుబడుల కలయికతో యూనిట్ లింకడ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి. బీమా కంపెనీ ఈ స్కీములో మనం పెట్టుబడి చేసిన చేసిన డబ్బుల్లో కొంత భాగాన్ని జీవిత బీమా కోసం కేటాయిస్తుంది. మిగతా డబ్బును ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి చేస్తుంది. దీని వల్ల మీకు ఇన్సూరెన్స్ తో పాటు దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 


3. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ : 


ఈ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథం కూడా మ్యూచువల్ ఫండ్ వంటిదే. అయితే దీని లాకిన్ పీరియడ్ కేవలం మూడేండ్లు మాత్రమే. ఈ స్కీంలో పెట్టిన పెట్టుబడిలో 80శాతాన్ని ఈక్విటీ స్టాక్స్ లో పెట్టుబడి చేస్తారు. దీని వల్ల మీకు మంచి రాబడితోపాటు పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. 


4. నేషనల్ పెన్షన్ స్కీమ్ 


రిటైర్మంట్ తర్వాత నెలనెలా పింఛన్ కావాలని ఆశించే వారికి నేషనల్ పెన్షన్ స్కీమ్ బాగుంటుంది. 


5. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 


60ఏండ్లు పైబడిన వారి కోసం బ్యాంకులు పోస్టాఫీసుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెడితే..వడ్డీ రూపంలో కచ్చితమైన ఆదాయం వస్తుంది. 


6. సుకన్య సమృద్ధి యోజన : 


10ఏళ్లలోపు ఆడబిడ్డల కోసం ప్రత్యేకం ఈ పథకాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇది తల్లిదండ్రులు లేదా చట్టబద్దమైన సంరక్షకులు గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లల కోసం 2 వేర్వేరు ఖాతాలు తెరవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన 21 ఏళ్ల తర్వాత గానీ లేదా ఆడబిడ్డకు 18ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి ఖర్చలు లేదా చదువు కోసం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. 


7. ప్రధానమంత్రి వయ వందన యోజన: 


60ఏండ్లు పైబడిన వ్రుద్ధులకు పెన్షన్ అందించడం కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈస్కీం తీసుకువచ్చింది. ఈ స్కీంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఏడాదికి 8శాతం వడ్డీరేటు చొప్పున లెక్క వేసి పెన్షన్ ఇస్తుంటారు. అయితే పెట్టుబడిదారులు నెల మూడు నెలలు, ఆరు నెలలు, 12 నెలల వ్యవధితో ఈ పెన్షన్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. 


8. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ 


భారతదేశంలో మోస్ట్ పాపులర్ స్కీముల్లో పీపీఎఫ్ ఒకటి.  ఈ స్కీములో ఏడాదికి 7.1శాతం వడ్డీరేటు ఇస్తారు. పైగా ఇన్ కం ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు ఉంటాయి. అసలుపైనే కాదు వడ్డీపై కూడా మిన్ను మినహాయింపు ఉంటుంది. 


9. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 


ఎలాంటి రిస్క్ లేకుండా, మంచి రాబడి ఇచ్చే స్కీంల కోసం చూసేవారికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ మంచి వాయిస్ అవుతుంది. దేశంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి ఈ స్కీములో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీం ద్వారా పొందిన రాబడిపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. 


10. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్: 


బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెడితే సాధారణంగా మధ్య విత్ డ్రా చేసుకునేందుకు వీలుండదు. కానీ పోస్టాఫీస్ స్కీముల్లో ఆ విధంగా ఉండదు. అవసరం అనుకుంటే చిన్న నోటీస్ ఇచ్చి పాక్షికంగా లేదా పూర్తిగా స్కీములోని డబ్బులు తీసుకోవచ్చు. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.