Stock Market Gold: స్టాక్ మార్కెట్లో జువెలరీ స్టాక్స్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి (మంగళవారం) బడ్జెట్ ప్రకటనతో నిర్మల సీతారామన్.. బంగారం, వెండి ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం ఆరు శాతానికి తగ్గిస్తున్నట్లు  ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో  ఒక్కసారిగా జువెలరీ స్టాక్స్ అన్నీ కూడా లాభాల బాట పడ్డాయి.మీరు కనుక జువెలరీ స్టాక్స్ పైన లుక్ వెయ్యాలనుకుంటే.. ఏ స్టాక్స్ పైన మీరు దృష్టి సారించవచ్చో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కళ్యాణ్ జ్యువెలరీ (kalyan Jewellers India):


స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీల్లో కళ్యాణ్ జ్యువెలరీ మంచి రిటర్న్ అందిచే స్టాక్స్ లో ఒకటిగా చెప్పవచ్చు.ముఖ్యంగా ఈ కంపెనీ గడిచిన ఏడాది కాలంగా 30 శాతం లాభాన్ని అందించింది. అంతేకాదు ఈ కంపెనీ  ప్రస్తుతం 579 రూపాయల వద్ద ట్రేడవుతూ బుధవారం..5 శాతం వరకూ లాభాన్ని అందించింది. ఇక ఈ కంపెనీ ప్రొఫైల్ విషయానికి వస్తే ఈ కంపెనీ 1993లో కేరళలోని త్రిసూర్ లో స్థాపించారు. ఈ కంపెనీకి చెందిన ఆభరణాల దుకాణాలు భారతదేశంలోని అన్ని ప్రముఖ నగరాలతో పాటు గల్ఫ్ దేశాల్లో కూడా ఈ కంపెనీ షాపులు ఉన్నాయి. చైర్మన్ కళ్యాణ రామన్ ఆధ్వర్యంలో మొత్తం 8000 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. 


Also read : Also read: Union Budget 2024 Updates: ఏపీ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్ల కేటాయింపు


టైటాన్ కంపెనీ (Titan Company):


టాటా గ్రూపునకు చెందిన ఈ స్టాక్ మార్కెట్లోనే మల్టీ బ్యాగర్ స్టాక్స్ లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఈ స్టాక్ ప్రస్తుతం 3493 రూపాయల వద్ద ఉండగా, 0.75 శాతం నేడు లాభపడింది. అలాగే గడిచిన ఏడాది కాలంగా ఈ కంపెనీ ఏడాది కాలంలో 17 శాతం లాభపడింది. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో 215 శాతం లాభపడింది. ఇక కంపెనీ ప్రొఫైల్ విషయానికి వస్తే 1984 చేతి గడియారాల కంపెనీగా ప్రారంభమైన టైటాన్ కంపెనీ 1994లో టానిష్క్ బ్రాండ్ ద్వారా ఆభరణాల మార్కెట్లో ప్రవేశించింది. కంపెనీకి ప్రస్తుతం ఆభరణాలు, వాచీలు, కళ్లద్దాలు, బ్యాగులు, పెర్ఫ్యూమ్స్, బెల్టులు, వాలెట్లు వంటి రంగాల్లో తన మార్కెట్ విస్తరించింది. కంపెనీ రెవెన్యూ రూ. 51,617 కోట్లుగా ఉంది. కంపెనికి మొత్తం 8690 మంది ఉద్యోగులు ఉన్నారు.  


Also read : Old vs New Tax System: పాత పన్ను విధానంలో ఎక్కువ టాక్స్ మినహాయింపులు ఉన్నాయా? ఏ పన్ను విధానం అయితే ఉద్యోగులకు మంచిది..?  



సెంకో గోల్డ్ సెంకో గోల్డ్ (Senco Gold):


సెంకో గోల్డ్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోని ప్రముఖ జువెలరీ స్టాక్స్ లో ఒకటి.ఈ కంపెనీ గత 30 సంవత్సరాలుగా వంశపారంపర్య బిజినెస్ చేస్తోంది. ఈ సంస్థ 1994లో జ్యువెలరీ రిటైలర్‌ రంగంలో ప్రవేశించింది. భారతదేశం అంతటా సెంకో  గోల్డ్ షోరూంలు ఉన్నాయి. ప్రస్తుతం "సెంకో గోల్డ్ అండ్ డైమండ్" బ్రాండ్ పేరుతో ఆభరణాలు విక్రయిస్తోంది. ప్రస్తుతం కంపెనీ షేరు 986 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అంతేకాదు ఈ కంపెనీ షేరు గత ఏడాది కాలంగా 165 శాతం లాభపడింది. కంపెనీకి దాదాపు 70 షోరూమ్‌లు 61 ఫ్రాంఛైజ్ షోరూమ్‌లతో. దేశంలోని 13 రాష్ట్రాలలో విస్తరించి ఉంది.


Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook