Union Budget 2024 Updates: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆశించిన స్థాయిలో కాకపోయినా ఏపీకు ప్రాధాన్యత ఇచ్చినట్టే కన్పిస్తోంది. ఏపీ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత దక్కింది. ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకపోయినా పలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరిగింది. ముఖ్యంగా ఏపీ పునర్విభజన చట్టానిక్ కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగా నిధుల కేటాయింపు ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు దక్కిన ప్రాధాన్యతలు ఇలా ఉన్నాయి.
ఏపీ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్లు
పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తి
ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు
విశాఖపట్నం చెన్నై, ఓర్వకల్లు-బెంగళూరు పారిశ్రామిక కేరిడార్ అబివృద్ధికి నిధులు
అమరావతి నిర్మాణానికి బహుళ సంస్థల ద్వారా నిధులు
ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
Also read: Godavari Floods: మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి, జలదిగ్భంధనంలో లంక గ్రామాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook