Financial Things to do: ఈ ఏడాదిలో ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐదో రోజు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. అయితే కొత్త సంవత్సరం వేడుకలకు ముందు ఆర్థిక పరంగా పలు ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆన్​లైన్​లో పూర్తి చేయాల్సిన ఈ పనులను.. చివరి వరకు వేచి చూడటం వల్ల సర్వర్ మొరాయించడం వంటి సమస్యలు తలెత్తొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకి ఈ ఏడాదే కచ్చితంగా పూర్తి చేయాల్సిన పనులు (Year End financial work) ఏమిటి? అవి పూర్తి చేయకుంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అనేది ఇప్పుడు చూద్దాం.


ఐటీఆర్ దాఖలు(Income tax return filing)..


2021-22 మదింపు సంవత్సరం లేదా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్​కం ట్యాక్స్ రిటర్ను (ఐటీఆర్) దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ గడువులోగా ఈ పనిని పూర్తి చేయకుంటే.. రూ.5000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.


కరోనాతో పాటు.. ఇన్​కం ట్యాక్స్ వెబ్​సైట్​లో సాంకేతిక సమస్యల కారణంగా పలు మార్లు ఐటీఆర్ ఫైలింగ్ గడువును పెంచింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరోసారి గడువు పెంచే యోచన లేదని సమాచారం. అందుకే గడువులోపే ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయడం ఉత్తమం.


లైఫ్​ సర్టిఫికెట్(Life certificate )..


పెన్షన్​ తీసుకునే వారు ప్రతి సంవత్సరంలానే ఈసారీ లైఫ్ సర్ఠిపికెట్ సమర్పించడం తప్పనిసరి. నిజానికి ఈ గడువు నవంబర్​తోనే ముగియాల్సి ఉండగా.. కొవిడ్ నేపథ్యంలో ఒక నెల అదనంగా గడువు ఇచ్చింది కేంద్రం. అందుకే డిసెంబర్ 31 లోపే లైఫ్​ సర్టిఫికెట్ సమర్పించడం తప్పనిసరి. గడువు లోపు ఈ పని పూర్తి చేయకుంటే.. వచ్చే నెల నుంచి పెన్షన్ ఆగిపోవచ్చు.


ఆధార్​తో-యూఏఎన్​ లింక్(Aadhar UAN Link)..


ఆధార్​ నంబర్​తో యూఏఎన్​ (యునివర్సల్ అకౌంట్ నంబర్) లేదా పీఎఫ్ నంబర్​ లింక్ చేసేందుకు డిసెంబర్ 31 చివరి తేదీ. అయితే ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలకు ఈ గడువు ముగిసింది. ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం ఈ అవకాశం ఉంది. ఈ గడువు లోగా లింక్ ప్రక్రియ పూర్తి చేయకుంటే.. ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో యాజమాన్యం వాటాను పొందలేరు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం ఉత్తమం.


డీమ్యాట్ ఖాతా కేవైసీ(Dmat KYC)..


ట్రేడింగ్​ కోసం ఉపయోగించే డీమ్యాట్ ఖాతాలకు కేవైసీ పూర్తి చేసేందుకు డిసెంబర్ 31ని తుది గడువుగా నిర్ణయించింది సెబీ. గడువులోపు కేవైసి పూర్తవకుంటే.. ట్రేడింగ్ ఖాతాను వినియోగించలేరని తెలిపింది. అందుకే ఈ నాలుగు రోజుల్లోనే కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి.


Also read: Flipkart Sale: ఫ్లిప్​కార్ట్ ఇయర్​ ఎండ్ సేల్​- స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!


Also read: Banking alert: జనవరి 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్​- ఏటీఎం లావాదేవీలకు అదనపు ఛార్జీలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook