Flipkart Sale: ఫ్లిప్​కార్ట్ ఇయర్​ ఎండ్ సేల్​- స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Flipkart Sale: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ ఇయర్​ ఎండ్ సేల్​ ప్రారంభించింది. స్మార్ట్​ఫోన్లపై అదిరే ఆఫర్లు ప్రకటించింది. ఐఫోన్​, ఎంఐ, వివో, ఒప్పొ సహా వివిధ బ్రాండెడ్ ఫోన్లపై ఇస్తున్న డిస్కౌంట్ల గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2021, 10:37 PM IST
  • ప్రిమియం స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్లు
  • ఇయర్ ఎండ్ సేల్​ పేరుతో ప్రత్యేక ఆఫర్లు
  • ఈ నెల 30వ వరకు కొనసాగనున్న సేల్​
Flipkart Sale: ఫ్లిప్​కార్ట్ ఇయర్​ ఎండ్ సేల్​- స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Flipkart Sale: కొత్తగా స్మార్ట్ ఫోన్​ కొనాలనుకునే వారికి గుడ్​ న్యూస్​. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ స్మార్ట్​ఫోన్​ ఇయర్ ఎండ్ సేల్ (Flipkart Smartphone Year End Sale) నిర్వహిస్తోంది. యాపిల్​, ఒప్పొ, రియల్​మీ సహా వివిధ బ్రాండ్​ల స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది.

ఇయర్​ ఎండ్ సేల్ డిస్కౌంట్లతో పాటు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్​, నో కాస్ట్ ఈఎంఐ, ఫ్లిప్​కార్ట్ స్మార్ట్​ అప్​గ్రేడ్​, వంటి సదుపాయాలు కల్పిస్తోంది. ఈ స్పెషల్ సేల్​ డిసెంబర్ 30 వరకు (Flipkart Smartphone sale) కొనసాగనుంది. ఇందులో ఏ ఫోన్​పై ఎంత డిస్కౌంట్ ఉంది అనే వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

ఐఫోన్​ 12 మిని..

బెస్ట్ సెల్లర్​​ ఫోన్లలో ఒకటైన యాపిల్ ఐఫోన్​ 12 మినిపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్​కార్ట్​. 64 జీబీ స్టోరేజ్ గల ఈ ఫోన్​ను రూ.41,119కి విక్రయిస్తున్నట్లు (Flipkart offer on i phone) తెలిపింది.

ఈ ఫోన్​లో 5.4 అంగుళాల డిస్​ప్లే, 5జీ సపోర్ట్​, బయోనిక్​ ఏ 14 చిప్​సెట్​, వైరల్​లెస్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. 5జీ సపోర్ట్ కూడా ఉంది.

మోటరోలా ఎడ్జ్​ 20 ఫ్యూజన్ ఆఫర్..

మోటరోలా ఎడ్జ్​ 20 ఫ్యూజన్ స్మార్ట్​ఫోన్ ధరను స్పెషల్ ఆఫర్​లో భాగంగా రూ.20,999కే విక్రయిస్తోంది ఫ్లిప్​కార్ట్. దీని అసలు ధర రూ.21,499గా (Flipkart offer on Moto phones) ఉంది.
6.67 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే, 108 మెగా పిక్సెల్​ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు.

వివో ఎక్స్​ 70 ప్రో

వివో ఎక్స్ 70 ప్రో మొబైల్ డిస్కౌంట్ ధరను రూ.46,990గా నిర్ణయించింది (Flipkart offer on Vivo phones) ఫ్లిప్​కార్ట్​. 128 జీబీ స్టోరేజ్​, 6.56 అంగుళాల ఫుల్ హెచ్​డీ+ డిస్​ప్లే. మీడియాటెక్ డైమెన్సిటి 1200 చిప్​సెట్​, 4,450 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్​ ప్రత్యేకత.

ఒప్పొ రెనో 6 (5జీ)

ఒప్పో రెనో 6 మొబైల్​ను ఇయర్ ఎండ్ ఆఫర్​లో రూ.29,990కే విక్రయిస్తోంది (Flipkart offer on OPPO Phones) ఫ్లిప్​కార్ట్​. 6.43 అంగళాల ఫుల్ హెచ్​డీ+ డిస్​ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, మీడియా టెక్​ డైమెన్సిటి 900 చిప్​సెట్​, 65 వాట్స్ ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ ప్రత్యేకత.

ఎంఐ 11 లైట్​

ఎంఐ 11 లైట్​ స్మార్ట్​ఫోన్ ఆఫర్ ధరను రూ.21,999గా నిర్ణయించింది ఫ్లిప్​కార్ట్​. దీని అసలు ధర రూ.24,999. 6.55 అంగళాల ఫుల్ హెచ్​డీ+ డిస్​ప్లే, 4,250 ఎంఏహెచ్​ బ్యాటరీ. ట్రిపుల్ రియర్​ కెమెరా, క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్​ 732 జీ ప్రాసెసర్​ వంటివి ఈ ఫోన్ ప్రత్యేకతలు.

రియల్​మీ జీడీ మాస్టర్​ ఎడిషన్

రియల్​మీ జీటీ మాస్టర్ ఎడిషన్​పై రూ.వేయ్యి డిస్కౌంట్ ఇస్తోంది. ఫోన్ ఆఫర్ ధరను రూ.25,999గా నిర్ణయించింది. 6.43 అంగుళాల ఫుల్​ హెచ్​డీ + డిస్​ప్లే, ట్రిపుల్ రియర్​ కెమెరా, క్వాల్కమ్్ స్నాప్​డ్రాగన్​ 778 జీ చిప్​సెట్​, 32 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా వంటివి ఈ ఫోన్ ప్రత్యేకతలు.

Also read: New year offers on iPhones: యాపిల్ వాచెస్, మ్యాక్‌బుక్స్, ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు, డిసెంబర్ 31 వరకే

Also read: Banking alert: జనవరి 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్​- ఏటీఎం లావాదేవీలకు అదనపు ఛార్జీలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News