Todays Gold Rate: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రస్తుతం బంగారం ధర నిన్నటితో పోలిస్తే నిలకడగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకే బంగారం ధర ఎప్పటికప్పుడు ప్రతిరోజూ మారుతుంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత కొద్దిరోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఇవాళ నిలకడగా ఉంది. 


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 6 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరల 53 వేల 20 రూపాయలుగా ఉంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 6 వందలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధరల 53 వేల 20 రూపాయలుగా ఉంది. కోల్‌కతా‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 6 వందల రూపాయలు కాగా. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 20 రూపాయలుంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 6 వందలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 20 రూపాయలుంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 460 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 960 రూపాయలుంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 6 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 20 రూపాయలుంది.ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.


Also read: SBI ATM New Rules: ఎస్బీఐ ఎటీఎంలలో కొత్త నిబంధన, డబ్బులు తీయాలంటే ఓటీపీ తప్పనిసరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook