Today Gold and Silver Rates: దేశంలో బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఉన్న డిమాండ్.. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ.. డాలర్ విలువ.. వివిధ దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే పసిడికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తారు కాబట్టి ధరలు పెరిగినా లేదా తగ్గినా వ్యాపారాలు మాత్రం జోరుగానే ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఇటీవలి కాలంలో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. 4-5 రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. 2 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో (జులై 10) పోల్చుకుంటే పసిడి ధర స్థిరంగా ఉంది. సోమవారం (జులై 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,950లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,210లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై.. 24 క్యారెట్ల ధరపై ఎలాంటి వ్యత్యాసం లేదు. అయితే బంగారం ధరలు మరింత తగ్గనున్నాయని తెలుస్తోంది. మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 57,200గా ఉంది. 


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,210గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,210గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,890గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,150 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,980.. 24 క్యారెట్ల ధర రూ. 51,210గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 46,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,210గా ఉంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,210గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 46,950.. 24 క్యారెట్ల ధర రూ. 51,210గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,210 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 62,800లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 62,800లుగా కొనసాగుతోంది. 


Also Read: Horoscope Today July 11 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అనూహ్య ధన లాభం!


Also Read: IND VS ENG 3rd T20: పోరాడి ఓడిన భారత్.. సూర్య శతకం వృథా! టీమిండియాదే టీ20 సిరీస్‌


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook