IND VS ENG 3rd T20: పోరాడి ఓడిన భారత్.. సూర్య శతకం వృథా! టీమిండియాదే టీ20 సిరీస్‌

England beat India by 17 runs in 3rd T20I. నాటింగ్‌హామ్‌ వేదికగా ఆదివారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ పోరాడి ఓడింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 11, 2022, 10:47 AM IST
  • పోరాడి ఓడిన భారత్
  • సూర్య శతకం వృథా
  • టీమిండియాదే టీ20 సిరీస్‌
IND VS ENG 3rd T20: పోరాడి ఓడిన భారత్.. సూర్య శతకం వృథా! టీమిండియాదే టీ20 సిరీస్‌

England beat India by 17 runs in 3rd T20I: నాటింగ్‌హామ్‌ వేదికగా ఆదివారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ పోరాడి ఓడింది. 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 రన్స్ చేసి.. 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (117; 55 బంతుల్లో 14x4, 6x6) సూపర్ సెంచరీతో పోరాడినా టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌ 2-1తో పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ రిషబ్‌ పంత్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే అవుట్ అయ్యాడు. ఫామ్‌ లేమితో సతమతమవుతున్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (11) మరోమారు తీవ్రంగా నిరాశపరిచాడు. క్రీజులో కుదురుకుంటున్న తరుణంలో రోహిత్‌ శర్మ (11) ఔట్‌ కావడంతో భారత్  ఇబ్బందుల్లో పడింది. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును సూర్యకుమార్‌ యాదవ్‌ ఆదుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (28; 23 బంతుల్లో 2x4)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే భారత్ 15 ఓవర్లకు 150 రన్స్ చేసి విజయం సాధించేలా కనిపించింది.

ఈ సమయంలో ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకున్నారు. 16వ ఓవర్‌ తొలి బంతికే శ్రేయస్‌ను టోప్లే పెవిలియన్‌కు పంపాడు. తర్వాతి ఓవర్‌లోనే దినేశ్ కార్తీక్‌  (7)ను విల్లే ఔట్‌ చేశాడు. రిచర్డ్‌ వేసిన 17వ ఓవర్‌లో జడే జా(7) కూడా ఓటవ్వడంతో భారత్ మరింత కష్టాల్లో పడింది. అయితే పరుగులి చేస్తూనే ఉన్న సూర్య శతకం పూర్తి చేశాడు. ఆపై అలీ వేసిన 19వ ఓవర్‌ ఐదో బంతికి ఔటయ్యాడు. సూర్య ఔటవ్వడంతో భారత్ ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్‌లో హర్షల్‌ పటేల్‌ (5), రవిబిష్ణోయ్‌ (2)లను జోర్డాన్‌ ఔట్‌ చేశాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో టోప్లే 3 వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. డేవిడ్‌ మలన్‌ (77; 39 బంతుల్లో 6x4, 5x6), లియమ్‌ లివింగ్‌స్టన్‌ (42 నాటౌట్‌; 29 బంతుల్లో 4x6) చెలరేగారు. జేసన్‌ రాయ్‌ (27; 26 బంతుల్లో 1x4, 2x6), జోస్‌ బట్లర్‌ (18; 9 బంతుల్లో 2x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. మొయిన్‌ అలీ (0) నిరాశపరిచినా..  బ్రూక్‌ (19), జోర్డాన్‌ (11) చెలరేగారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌, హర్షల్‌ పటేల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. 

Also Read: Horoscope Today July 11 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అనూహ్య ధన లాభం!

Also Read: Heavy Rains: కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News