Gold And Silver Rates Today :  బంగారం ధర తగ్గుముఖం పట్టింది ఆగస్టు 19వ తేదీ సోమవారం హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,760 రూపాయల వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర 66,690 గా ఉంది. ఆదివారంతో పోల్చి చూసినట్లయితే, బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరలు గడచిన మూడు, నాలుగు రోజులుగా భారీగా పెరిగాయి. దీని వెనుక అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, అమెరికా సెంట్రల్ బ్యాంకు గోల్డ్ రిజర్వు, వడ్డీ రేట్లలో మార్పుల గురించి వస్తున్న వార్తలు వంటివి పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణాలు చూద్దాం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చేనెల జరిగే భేటీలో కీలక వడ్డీ రేట్లు అర శాతం వరకు తగ్గించే అవకాశం ఉందనే వార్తలు బంగారం సెంటిమెంటును ఒక్కసారిగా పెంచాయి. దీంతో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించే ప్రమాదం ఉందనే వార్తలతో పసిడి ధర ఒక్కసారిగా పెరిగింది. 


దీనికి తోడు అమెరికా మాంద్యం భయాలు కూడా పసిడి ధరలు పెరగడానికి దోహదపడుతున్నాయి. దేశీయంగా శ్రావణమాసం కావడంతో బంగారానికి మంచి డిమాండ్ ఏర్పడింది. వరుసగా శుభముహూర్తాలు వివాహాలు కూడా ఉండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా కూడా దేశీయంగా బంగారం ధర పెరగడానికి తోడ్పడుతోంది.


Also Read : Banks: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదా?అయితే పెనాల్టీ ఛార్జీలు ఇవే..!!  


పసిడి ధరలు ప్రస్తుతం ఉన్న రేంజ్ వద్ద నుంచి ఎంతవరకు పెరిగే అవకాశం ఉందనే వార్తలు కూడా ప్రస్తుతం వస్తున్నాయి. అయితే బంగారం ధర అతి త్వరలోనే 75 వేల మార్కును దాటే అవకాశం ఉందని బులియన్ పండితులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు బంగారం ధరలు రికార్డు స్థాయిని తాకే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే సమీప భవిష్యత్తులో బంగారం ధరను ప్రభావితం చేసేవి అంతర్జాతీయ పరిణామాలు మాత్రమే అన్న సంగతి గుర్తించాలి.


 బంగారం ధరలు భారీగా పెరగడం  ట్రెండును కొనసాగించినట్లయితే , సమీప భవిష్యత్తులో  బంగారం ధరలు 80000 మార్కును  దాటే అవకాశం కూడా కనిపిస్తోంది.  ఇదే కనుక జరిగితే బంగారం కొత్త రికార్డు స్థాయిని సృష్టిస్తుంది. . అయితే పసిడి ధరలు పెరగడంతో నగలు కొనుగోలు చేసే వారికి ఒకసారిగా షాక్ తగిలింది.  కానీ బంగారంపై పెట్టుబడి పెడుతున్న వారికి మాత్రం మంచి రాబడి అందిస్తుందని చెప్పవచ్చు.  ఎవరైతే బంగారంపై సావరిన్ గోల్డ్ బాండ్ రూపంలో పెట్టుబడి పెడుతున్నారో వారికి చక్కటి ఆదాయం లభించే అవకాశం ఉంది.


Also Read : Post Office Superhit Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌తో నెలకు 20,500 రూపాయలు గ్యారంటీ ఆదాయం, ఎలాగంటే


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook