Post Office Superhit Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌తో నెలకు 20,500 రూపాయలు గ్యారంటీ ఆదాయం, ఎలాగంటే

Post Office Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల కంటే పోస్టాఫీసుల్లోనే ఆకర్షణీయమైన స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో జీరో రిస్క్‌తో అధిక ప్రయోజనాలు పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 17, 2024, 09:13 PM IST
Post Office Superhit Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌తో నెలకు 20,500 రూపాయలు గ్యారంటీ ఆదాయం, ఎలాగంటే

Post Office Superhit Scheme: కష్టపడి సంపాదించిన సొమ్ము వృద్ధాప్యంలో అంటే రిటైర్ అయ్యాక అక్కరకు వచ్చేందుకు పోస్టాఫీసుల్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు మంచి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ఇది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 20 వేల రూపాయలు అందుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

నెలకు 20 వేల 500 రూపాయలు సంపాదించాలనుకుంటే సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీసు మంచి స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో ఐదేళ్ల వరకు నెలకు 20,500 రూపాయలు అందుతాయి. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవాళ్లు తమ సేవింగ్స్ ద్వారా జీవిత చరమాంకంలో హాయిగా జీవించవచ్చు. సీనియర్ సిటిజన్ల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అందిస్తోంది. ఇందులో గరిష్టంగా నెలకు 20,500 రూపాయలు అందుకోవచ్చు. అది కూడా ఐదేళ్ల వరకూ తీసుకోవచ్చు. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పధకంలో చేరేందుకు కనీస పెట్టుబడి 1000 రూపాయలు. రిటైర్మెంట్ తరువాత నెలనెలా నిర్ణీత ఆదాయం కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నెలకు లేదా మూడు నెలలకోసారి వడ్డీ అందుకోవచ్చు. ఈ వడ్డీ డబ్బులతో నెలవారీ ఖర్చులు చూసుకోవచ్చు.

ఈ స్కీమ్ 60 ఏళ్లు దాటినవారికే కాకుండా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని 55-60 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. డిఫెన్స్‌లో పనిచేసివారైతే 50 ఏళ్లుంటే సరిపోతుంది. మీ భార్యతో కలిసి కూడా జాయింట్ ఎక్కౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఇద్దరూ స్కీమ్ ప్రయోజనాలు పొందవచ్చు. కనీసం 1000 రూపాయలు గరిష్టంగా 30 లక్షల రూపాయలు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ అనేది 1000 రూపాయల చొప్పున పెంచుకోవచ్చు. గరిష్టంగా 30 లక్షలు దాటకూడదు. 

పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై వడ్డీ ప్రస్తుతం 8.2 శాతం అందుతోంది. ఇది ప్రస్తుతం ఉన్న చాలా సేవింగ్ స్కీమ్స్ కంటే ఎక్కువ. 30 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీ ఏడాదికి 2.46 లక్షలు అవుతుంది. అంటే నెలకు 20,500 రూపాయలు వస్తాయి. రిటైర్మెంట్ తరువాత ఇది బెస్ట్ ఆప్షన్. రిటైర్మెంట్ తరువాత రిస్క్ లేకుండా సురక్షితమైన విధానంలో పెట్టుబడి పెట్టేందుకు మంచి ఆప్షన్ ఇది. అందుకే పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్ అయింది. 

Also read: Jio 999 Recharge Plan: జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్, అన్‌లిమిటెడ్ హై స్పీడ్ డేటా, 15 ఓటీటీ సేవలు ఉచితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News