Today Gold Rate 29th September 2024:  మహిళలకు ఇది ఈ వార్త కాస్త రిలీఫ్ ఇస్తుందనుకోవచ్చు. గత వారం పదిహేను రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త శాంతించాయి. ధరల పెరుగుదలకు బ్రేకులు పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర రికార్డ్ గరిష్టాల నుంచి వెనక్కు తగ్గడంతో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే భారీగా పెరగడంతో ఈ తగ్గుదల పెద్దగా తేడా చూపించలేదు. ప్రస్తుతం దేశీయంగా పండగల సందడి నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 మరో రెండు మూడు వారాల్లో దసరా, దీపావళి పండగలు వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. బంగారు ఆభరణాలకు కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. దీంతో ధరలు మళ్లీ పెరుగుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్న తరుణంలో హైదరాబాద్ లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 


అంతర్జాతీయ బులియన్ మార్కెట్లు పసిడి ధరలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే శనివారం రోజు ధరలు కాస్త వెనక్కు తగ్గాయి.  మనదేశం కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో రూ. 83,748 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వారం రోజుల తర్వాత కాస్త దిగి వచ్చాయి. నేడు 22క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై రూ. 50 తగ్గింది. దీంతో తులం ధర రూ. 70వేల 950 వద్ద ట్రేడ్ అవుతోంది. 24క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 50 తగ్గడంత  రూ. 77వేల 400 పలుకుతుంది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ. 50తగ్గింది. దీంతో రూ. 71,100 వద్దకు దిగివచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 50 తగ్గి రూ. 77, 550 పలుకుతోంది. 


Also Read: Success Story : చెట్టు కింద కూర్చుంటే వచ్చిన ఒక ఐడియా.. ఆయన జీవితాన్నే మార్చేసింది.. నేడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే శాసిస్తున్నాడు  


అటు బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా పెరుగుతోంది. ఇప్పటికే వెండి లక్ష రూపాయల మార్క్ ను దాటేసింది. అయితే నేడు వెండి ధర కాస్త తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1000 తగ్గింది. రూ. 1,01,000 వద్దకు దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1000 తగ్గి..రూ. 95వేల వద్దకు దిగివచ్చింది. 


Also Read: Amazon offers: లక్ష రూపాయల స్మార్ట్ టీవీని రూ. 33వేలకే సొంతం చేసుకోండి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.