Book My Show CEO Ashish Himrajani: ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం బుక్ మై షో సీఈవో ఆశిష్ హిమ్రజాని జీవితమే అని చెప్పవచ్చు. చాలామంది కలలు కంటారు. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడతారు. దీర్ఘకాలిక ప్రణాళికలో ప్రయాణం అవుతారు. క్రమశిక్షణతోను, తమ తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కానీ అశిష్ విషయంలో మాత్రం ఒకరకంగా చెప్పాలంటే అదృష్టం కూడా తోడైందనే చెప్పవచ్చు. అయితే అర్హత ఉన్నవాడికే అదృష్టం లభిస్తుంది అనడానికి నిజమైన నిదర్శనం ఆశిష్.
బుక్ మై షో అనే యాప్ ఈరోజు మన దేశంలో దాదాపు అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలను శాసిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఈరోజు ఎంత పెద్ద సూపర్ స్టార్ హీరో సినిమా అయినా సరే బుక్ మై షో రేటింగ్ చూసే ప్రేక్షకులు తన టికెట్ బుక్ చేసుకుంటున్నాడు అనేది వాస్తవం. మెట్రో నగరాల నుంచి మున్సిపాలిటీల వరకు విస్తరించి ఉన్న థియేటర్లలో ఈ బుక్ మై షో ఆప్ తన కార్యకలాపాలను విస్తరించింది. అంతటితో ఆగిందా అటు ఈవెంట్స్ విషయంలో కూడా బుక్ మై షో దూకుడుగా వెళుతుంది. అలాంటి బుక్ మై షో వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఆశిష్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆశిష్ జీవితంలో బుక్ మై షో అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఆశిష్ 1975 సంవత్సరం ముంబైలో జన్మించాడు. అతని స్కూలింగ్ జుహులో ఉన్న మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుండి పూర్తయ్యింది. దీని తరువాత, అతను మితిబాయి కళాశాల నుండి గ్రాడ్యుయేషన్, సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి MBA చేసాడు. చదువు తర్వాత, అతను ప్రకటనల కంపెనీ J వాల్టర్‌లో పని చేయడం ప్రారంభించాడు.
1999లో ఆశిష్ హాలిడే కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. అక్కడే ఖాళీ సమయంలో ఓ రోజు చెట్టు కింద కూర్చొని రేడియోలో ప్రోగ్రామ్ అంటున్నాడు. అదే సమయంలో ఆ దేశంలో పాపులర్ ఆట అయిన రగ్బీ గేమ్ టికెట్ల ప్రకటనను విన్నాడు. అప్పుడే అతని మెదడులో ఒక చురుకైన ఆలోచన వచ్చింది. అసలు ఇలాంటి టికెట్ల వ్యాపారం సినిమా రంగంలో ప్రవేశపెడితే ఎలా ఉంటుందనే ఆలోచన అతని మెదడులో మెరిసింది. ఇంకేంటి వెంటనే తన ఆలోచనకు కార్యరూపం దాల్చేందుకు తన స్నేహితులతో కలిసి స్వదేశానికి వచ్చి 1999లో బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని స్థాపించాడు.
అయితే ఆశిష్ ఈ రంగంలోకి అడుగుపెట్టే సమయానికి మన దేశంలో స్మార్ట్ ఫోన్లు లేవు అలాగే ఇంటర్నెట్ కూడా అంతగా లేదు. ఇక ఆన్లైన్ ద్వారా చెల్లింపులు అనేవి అసలే లేవు. అలాంటి సమయంలో ఆన్లైన్ టికెట్ బుకింగ్ అనేది ఒక కల అనే చెప్పవచ్చు. అప్పుడే ఆశిష్ నెమ్మదిగా డాట్ కామ్ పరిశ్రమలో అడుగు పెట్టాడు. 2002 సంవత్సరంలో ఈ డాట్ కామ్ పరిశ్రమ క్రాష్ అయ్యింది దీంతో అతను పెట్టిన కంపెనీ కూడా నష్టాల్లోకి జారుకుంది ఫలితంగా తాను ప్రారంభించిన టికెటింగ్ వ్యాపారం క్రమంగా గ్యారేజ్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా నగరాల్లో ప్రారంభించిన ఆన్లైన్ టికెట్ కాల్ సెంటర్ లను మూసివేయాల్సి వచ్చింది.
అయితే అనూహ్యంగా 2006 సంవత్సరంలో నెట్ బ్యాంకింగ్ ప్రారంభమైంది. అలాగే దేశంలో మల్టీప్లెక్స్ ల సంఖ్య కూడా పెరగడం ప్రారంభించింది. దీంతో 2007 సంవత్సరంలో ఆశిష్ కలలకు రెక్కలు వచ్చాయి. వెంటనే తన బ్రాండ్ ను బుక్ మై షో గా మార్చాడు. ఫోన్లు ఆన్లైన్ వ్యవస్థ పెరిగే కొద్దీ బుక్ మై షో కు ఆదరణ పెరిగింది. మల్టీప్లెక్స్ లలో సినిమా టికెట్ బుక్ చేసుకోవాలంటే వారికి ఏకైక ఆప్షన్ గా బుక్ మై షో మిగిలింది. ఫలితంగా 2011 వ సంవత్సరానికి కంపెనీ దాదాపు 16 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది. ఇక అక్కడి నుంచి వెనక్కి చూసుకోలేదు. ప్రస్తుతం బుక్ మై షో కంపెనీ విలువ దాదాపు 7,500 కోట్లు స్వయంగా ఆశిష్ నికర ఆస్తుల విలువ 3 వేల కోట్ల రూపాయలుగా ఉంది.
Also Read: Amazon offers: లక్ష రూపాయల స్మార్ట్ టీవీని రూ. 33వేలకే సొంతం చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.