Petrol Diesel Prices: దేశంలో ఇవాళ్టి ఇంధన ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల్ని మొబైల్ నుంచి ఎలా తెలుసుకోవడం

Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇవాళ మరోసారి మార్పు వచ్చింది. ఆయిల్ కంపెనీలు కొత్త ధరలు జారీ చేశాయి. గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ఇవాళ మారాయి. పెట్రోల్, డిజిల్ కొత్త ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇవాళ మరోసారి మార్పు వచ్చింది. ఆయిల్ కంపెనీలు కొత్త ధరలు జారీ చేశాయి. గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ఇవాళ మారాయి. పెట్రోల్, డిజిల్ కొత్త ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ప్రతిరోజూ నిరంతరం పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరల్ని తగ్గించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్గించింది. మే 21వ తేదీన పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏ విధమైన మార్పు రాలేదు. ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంంతో..వారం రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.
కేంద్ర ప్రభుత్వం మే 21వ తేదీ లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. ఫలితంగా లీటరు పెట్రోలు 9.50 రూపాయలు, డిజిల్‌పై 7 రూపాయలు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో..కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొద్దిగా ధరల్ని తగ్గించాయి. మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు పెట్రోల్-డీజిల్ ధరలపై వ్యాట్ కొద్దిగా తగ్గించాయి.
వివిధ నగరాల్లో ఇవాళ్టి ఇంధన ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 96.72 రూపాయలు కాగా, డీజిల్ 89.62 రూపాయలు
ముంబైలో లీటర్ పెట్రోల్ 111.35 రూపాయలు కాగా, డీజిల్ 97.28 రూపాయలు
చెన్నైలో లీటర్ పెట్రోల్ 102, 63 రూపాయలు కాగా డీజిల్ 94.24 రూపాయలు
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ 106.63 రూపాయలైతే..డీజిల్ 92.76 రూపాయలు
భువనేశ్వర్‌లో లీటర్ పెట్రోల్ 103.19 రూపాయలు కాగా, డీజిల్ ధర 94.76 రూపాయలు
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 109.66 రూపాయలు కాగా డీజిల్ ధర 97.82 రూపాయలు
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరల్ని వివిధ ఆయిల్ కంపెనీలు అప్‌డేట్ చేస్తుంటాయి. మీ ప్రాంతాల్లో పెట్రోల్, డిజిల్ దరలు ఎలా ఉన్నాయనేది మీ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ఇండియన్ ఆయిల్ కంపెనీ అయితే.. ఆర్ఎస్‌పి అని రాసి 9224992249 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి. బీపీసీఎల్ అయితే ఆర్ఎస్‌పి అని రాసి 9223112222 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి. అదే హెచ్‌పీసీఎల్ అయితే హెచ్‌పి ప్రైస్ అని రాసి..9222201122 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.
Also read: Realme Smart TV Flipkart: రూ.2,249 ధరకే రియల్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని కొనేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook