Gold And Silver Rate Today: బంగారం ధరలు ఆగస్టు 16 శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర  250 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,650 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,560 వద్దకు చేరుకుంది. బంగారం ధరలు హైదరాబాదు నగరంలో 71,600 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర 65,600 వద్ద పలుకుతోంది. ఇదిలా ఉంటే శ్రావణమాసంలో బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం వరుసగా శుభకార్యాలు ఉండటంతో పాటు వివాహాల సీజన్ కావడంతో పెద్ద ఎత్తున నగల వ్యాపారం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధరలు గడచిన రెండు వారాలుగా తీవ్రంగా హెచ్చుతగ్గులకు గురవుతోంది. బంగారం ధరలు గతవారం భారీగా తగ్గు ముఖం పట్టి రూ. 70 వేల కిందకు తగ్గింది కానీ ఈ వారం ప్రారంభం నుంచి కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధర 72 వేల సమీపంలో ట్రేడ్ అవుతోంది. దీంతో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నట్లు గమనించవచ్చు. అయితే నిన్నటి ధరతో పోల్చి చూసినట్లయితే బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.


Also Read : PSU Stock: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.10లక్షలు మీకు దక్కేవి...ఏ స్టాక్ అంటే..?


 కానీ అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు భారీగా పెరుగుతాయని సూచనలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా సెప్టెంబర్ నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక భేటీలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందనే వార్తలతో ఒక్కసారిగా బంగారం ధరలు పెరగటం ప్రారంభించాయి. దీనికి తోడు చైనా సెంట్రల్ బ్యాంకు పెద్ద ఎత్తున బంగారం నిధులను కొనుగోలు చేస్తుంది. ఇది కూడా దేశ ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ ను అమాంతం పెంచింది. ఫలితంగా దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరగటం ప్రారంభించాయి.


బంగారం ధరలు పెరుగుదలకు అటు దేశీయంగా పండగ సీజన్ కావడం కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రాబోయే రెండు మాసాల్లో దసరా దీపావళి వంటి పెద్ద పండుగలు ఉన్న నేపథ్యంలో బంగారం ఎక్కువగా భారతీయులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనికి తోడు వరుసగా 3 నెలల పాటు వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. 


ఈ నేపథ్యంలో పసిడి ధరలు ఒకసారిగా పెరగటం ప్రారంభించాయి ఇక అంతర్జాతీయంగా గమనించినట్లయితే ప్రస్తుతం ఒక హౌస్ బంగారం ధర 2450 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో దేశీయంగా కూడా భారీ బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ దిగిరావాలంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది.


Also Read : Adani Power: బంగ్లాదేశ్‌కు కరెంటు సప్లై చేస్తాం..గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే విద్యుత్ సరఫరా : అదానీ పవర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook