Top 5 Electric Cars: 15 లక్షల కంటే తక్కువకు లబించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు
Top 5 Electric Cars: ఇంధన ధరలు పెరుగుతుండటంతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. దేశంలో అందుబాటులో ఉన్న అన్ని కంపెనీలు ఈవీ కార్లను ప్రవేశపెడుతున్నాయి. బడ్జెట్ కాస్త ఎక్కువైనా మెయింటెనెన్స్ విషయంలో ప్రయోజనం కలుగుతుంది.
Top 5 Electric Cars: మారుతి, టాటా, ఎంజీ మోటార్స్, హ్యుండయ్ ఇలా అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడుతున్నాయి. టాటా అన్నింటి కంటే ముందు ఉందని చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్ దాదాపు అన్ని మోడల్ కార్లకు ఈవీ వేరియంట్ లాంచ్ చేస్తోంది. ఈ నేపధ్యంలో 15 లక్షల కంటే తక్కువకు లభిస్తున్న టాప్ 5 ఈవీ కార్లు ఏవో తెలుసుకుందాం.
పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. మెయింటెనెన్స్ పెట్రోల్-డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లకు చాలా తక్కువ. కానీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చాలా ఎక్కువ. ఈ క్రమంలో 15 లక్షల బడ్జెట్‌లో లభించే ఎలక్ట్రిక్ కార్లు ఏమున్నాయి. అందులో టాప్ 5 కార్లు ఏమున్నాయో ఓసారి పరిశీలిద్దాం. టాప్ 5 ఈవీ కార్లు ఏమున్నాయి, ధర ఎంత, మైలేజ్ ఎంతనే వివరాలు తెలుసుకుందాం.
MG Comet EV
దేశంలో అత్యంత అనువైన ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు ఇది. ఈ కారు బేసిక్ వేరియంట్ 7.98 లక్షలతో ప్రారంభమౌతుంది. ఇందులో టాప్ వేరియంట్ కారు ధర 9.98 లక్షలుంది. సింగిల్ ఛార్జ్‌పై ఈ కారు 230 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
Tata Punch EV
టాటా అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఇదొకటి. ఇటీవలే జనవరి నెలలో టాటా పంచ్ ఈవీ కారు లాంచ్ అయింది. ఈ కారు ప్రారంభ ధర 11 లక్షల రూపాయలు. గరిష్టంగా 14.49 లక్షలుంది. ఇందులో మీడియం రేంజ్ వేరియంట్ ఫుల్ ఛార్జ్‌పై 315 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే..లాంగ్ రేంజ్ మోడల్ 421 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
Tata Tiago EV
టాటా టియాగో ఈవీ. ఇది కూడా అత్యంత ఎకానమీ ఎలక్ట్రిక్ కారు. ఈ కారు బేసిక్ ధర 8.69లక్షలతో ప్రారంభమై గరిష్టంగా 12.04 లక్షల వరకూ ఉంది. అయితే ఇది ఎక్స్ షోరూం ధరలు. ఇందులో 24 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఫుల్ ఛార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
Tata Tigor EV
టాటా టిగోర్ ఈవీ కారుల మోస్ట్ కంఫర్టబుల్ అండ్ ఎకనామిక్ కారుగా చెప్పవచ్చు. టాటా టిగోర్ ఈవీ వేరియంట్ ధర 12.49 లక్షల నుంచి ప్రారంభమై..13.75 లక్షల వరకూ ఉంటుంది. పుల్ ఛార్జ్‌పై 315 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
Citroen eC3
ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయెన్ ఇ సి3 కారు మోస్ట్ అఫోర్డబుల్ కార్లలో ఒకటి. ఇదొక హ్యాచ్‌బ్యాక్ కారు. ఈ కారు బేసిక్ వేరియంట్ ధర 11.61 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధర 12.49 లక్షలుంది. ఫుల్ ఛార్జ్‌పై ఈ కారు 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
Also read: Employees Leaves: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, భారీగా పెరగనున్న ఉద్యోగుల సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook