Top Selling Electric Cars in India: టాటా టియాగో :
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో టాటా మోటార్స్ అగ్రగామిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుండే ఎక్కువ రకాల మోడల్స్, వేరియంట్స్ ఉండగా అందులోనూ టాటా టియాగో ముందంజలో ఉంది. ఔను, టాటా మోటార్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఇండియన్ మార్కెట్లో టాటా మోటార్స్ ఇప్పటివరకు 5 లక్షల టాటా టియాగో కార్లు విక్రయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా నెక్సాన్ ఈవీ : 
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా నెక్సాన్ ఈవి కారు రెండో స్థానంలో నిలిచింది. టాటా నెక్సాన్ ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 50,000 పైగా కార్లు ఇండియన్ మార్కెట్లో విక్రయించింది.


టాటా టిగోర్ ఈవి :
మనం ముందే చెప్పుకున్నట్టుగా ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో తొలి మూడు స్థానాలు టాటా మోటార్స్ సొంతం చేసుకుంది. ఈ జాబితాలో టాటా టిగోర్ ఈవి కారు మూడో స్థానం కైవసం చేసుకుంది. ఇప్పటివరకు 3,257 కి పైగా టాటా టిగోర్ కార్లు విక్రయించింది. 


మహింద్రా XUV 400 EV :
టాటా మోటార్స్ తరువాత మళ్లీ అగ్రెసివ్ గా దూసుకుపోతున్న కార్ల తయారీ కంపెనీల్లో మహింద్రా అండ్ మహింద్రా కూడా ముందుంది. మహింద్రా అండ్ మహింద్రా తయారు చేసిన మహింద్రా XUV 400 EV కారు ఇప్పటి వరకు 2234 కార్లు విక్రయించి ఈ జాబితాలో నాలుగో స్థానం సొంతం చేసుకుంది.


ఎంజీ జెడ్ ఎస్ ఈవీ : 
ఎంజీ జెడ్ ఎస్ ఈవీ .. ఇండియాలో ఎంజీ మోటార్స్ నుండి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే. 2019 లో ఎంజీ జెడ్ ఎస్ ఈవీ లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 10 వేలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి.


ఎంజీ కామెట్ EV :
మార్కెట్లోకి ఎంజీ కామెట్ EV ఆలస్యంగా వచ్చినప్పటికీ.. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో మాత్రం చోటు దక్కించుకుంది. లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు 1914 కార్లు విక్రయించింది. 


ఇది కూడా చదవండి : Hyundai Cars Discount Mela: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్


సిట్రోయెన్ eC3 కారు :
సిట్రోయెన్ eC3 కారు లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 576 కార్లను ఆ కంపెనీ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో విక్రయించింది. ఇండియన్ మార్కెట్ కి సిట్రోయెన్ కొత్త కావడంతో మార్కెటింగ్ లో ఇంకా వెనుకబడే ఉంది. కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే సిట్రోయెన్ కార్ల కంపెనీ ప్రమోషన్స్‌లో దూకుడు చూపించకపోవడం వంటి అంశాలు ఈ సిట్రోయెన్ కార్ల సేల్స్ ఇంకా పుంజుకోలేకపోతున్నాయనేది మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న మాట.


ఇది కూడా చదవండి : Tata Electric Cars: 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు అమ్మిన టాటా మోటార్స్‌.. ఎలాగంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి