Train Ticket Booking: రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన గమనిక! రైలు ప్రయాణంలో చాలా మంది టికెట్లు, బెర్తుల విషయంలో తరచుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైల్వే టికెట్ బుక్ చేసుకునే ప్రతి ఒక్కరూ లోయర్ బెర్త్ ను బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. కానీ, భారతీయ రైల్వే మార్గదర్శకాల ప్రకారం.. లోయర్ బెర్తులను సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ, కొన్ని సందర్భాల్లో లోయిర్ బెర్తు కావాల్సిన వృద్ధులు, దివ్యాంగులకు దొరకని సందర్భాలు కూడా ఉన్నాయి. లోయర్ బెర్తు కోసం రిక్వెస్ట్ చేసినా.. ఆ బెర్తు దొరకని పరిస్థితులు కూడా చాలానే జరిగాయి. అలాంటి సమయంలో వారు ప్రయాణించడం కష్టంగా మారుతంది. కానీ, ఇప్పుడు రైల్లో మీరు లోయర్ బెర్త్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇకపై సులభంగా లోయర్ బెర్తును బుక్ చేసుకోవచ్చు. 


ట్విట్టర్‌లో ఒక ప్రయాణికుడు భారతీయ రైల్వేని సూటిగా ప్రశ్నించాడు. తాను బుక్ చేసే రైల్లో 102 బెర్తులు ఖాళీగా ఉన్నా.. మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ ఇచ్చారని సదరు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశాడు. అన్ని ఖాళీల్లో తన కుటుంబసభ్యుల కోసం లోయర్ బెర్త్ కు రిక్వెస్ట్ చేసుకున్నా.. దాన్ని అలాట్ చేయలేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇదేం దిక్కుమాలిన లాజిక్ అని ప్రశ్నించగా.. ఆ ట్వీట్ పై రైల్వే బుకింగ్ సైట్ IRCTC స్పందించింది.  


సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత


"సర్.. లోయర్ బెర్త్ లు, సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం కేటాయించినవి. 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న మహిళల కోసం ఈ బెర్తులను కేటాయించారు. వీరిలో ఎవరైనా ఒంటరిగా లేదా ఇద్దరుగా ప్రయాణించినా.. వారికి లోయర్ బెర్తులను సిస్టమ్ అలాట్ చేస్తుంది. ఒకవేళ మీరు బుక్ చేసే రెండు టికెట్లలో ఏ ఒక్కరూ సీనియర్ సిటిజన్ కాకపోయినా.. వారికి లోయర్ బెర్తు అలాట్ కాద"ని రైల్వే టికెట్ బుకింగ్ సంస్థ ఐఆర్టీసీటీ సంస్థ ట్వీట్ చేసింది. 


రైల్వే నిబంధనల ప్రకారం.. 45 ఏళ్లు నిండిన మహిళలకు లేదా 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు లోయర్ బెర్తు ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి క్రమంలో కుటుంబం మొత్తం ప్రయాణించాలనుకునే వాళ్లు వృద్ధులకు సెపరేట్ గా టికెట్ బుక్ చేయడం మంచిది. ఎందుకంటే కుటుంబంలోని ఇతర వయసు వాళ్లను దృష్టిలో ఉంచుకొని.. లోయర్ బెర్తు కేటాయించపోయే అవకాశం ఉంది.  


Also Read: Flipkart Sale: iPhone 13 Miniపై ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు.. ఆఫర్ ఇంకొక్క రోజు మాత్రమే!


Also Read: Mi Fan Festival: రూ.13,999 విలువైన Redmi స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.999లకే కొనేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook