TVS iQube: దేశంలో ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం బైక్స్ కంటే స్కూటీ మోడల్స్ ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. ఫ్యామిలీ అండ్ లగేజ్ కంఫర్ట్ కోసం ఎక్కువగా స్కూటీ మోడల్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు రోడ్లపై హల్‌చల్ చేస్తున్నాయి. ప్రముఖ టూ వీలర్ కంపెనీ టీవీఎస్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అతి తక్కువ ధరకే లాంచ్ కావడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TVS కొత్తగా  TVS iQube స్కూటర్ లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్ 2.2 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో లాంచ్ అయింది. ఇది కాకుండా TVS iQube నుంచి టాప్ ఎస్‌టీ వేరియంట్లు కూడా ఉన్నాయి. ఈ వేరియంట్లు అయితే 3.4 కిలోవాట్స్ , 5.1 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్స్‌తో లభిస్తాయి. TVS iQube మొత్తం మూడు బ్యాటరీ ప్యాక్స్‌తో మార్కెట్‌లో లాంచ్ అయింది. బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ధర మారుతుంటుంది. 


TVS iQube ఫీచర్లు , ప్రత్యేకతలు


TVS iQube బేసిక్ వేరియంట్‌లో 4.4 కిలోవాట్స్ హబ్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది. ఇది 140 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది 2.2 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఎకానమీ మోడ్‌లో 75 కిలోమీటర్లు, పవర్ మోడ్‌లో 60 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. 2 గంటల్లో 0-80 శాతం బ్యాటరీ ఛార్జ్ కాగలదు. ఈ వేరియంట్ రెండు రంగుల్లో అంటే వాల్‌నట్ బ్రౌన్, పర్ల్ వైట్‌లో అందుబాటులో ఉంది. బేసిక్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర 94,999 రూపాయలుగా ఉంది. ఇందులో ఈఎంపీఎస్ సబ్సిడీ, క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంటుంది. ఈ ప్రారంభ ధర జూన్ 30 వరకు మాత్రమే వర్తిస్తుంది. బేసిక్ వేరియంట్‌లో 5 ఇంచెస్ కలర్ టీఎఫ్‌టి స్క్రీన్, 950 వాట్స్ ఛార్జర్, క్రాష్ అలర్ట్, టో అలర్ట్, టర్న్ బై టర్న్ నేవిగేషన్, డిస్టెన్స్ టు ఎంప్టీ, 30 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ అప్షన్లు ఉంటాయి.


ఇక TVS iQube STలో రెండు బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. అవి 3.4 కిలోవాట్స్ , 5.1 కిలోవాట్స్. ఈ రెండింట్లో 3.4 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ధర 1.55 లక్షల రూపాయలుగా ఉంది. అదే 5.1 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ధర 1.85 లక్షలుగా ఉంది. ఇందులో 3.4 కిలోవాట్స్ సింగిల్ ఛార్జ్‌పై 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. టాప్ స్పీడ్‌లో అయితే 78 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు. అదే 5.1 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే సింగిల్ ఛార్జ్‌తో 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. టాప్ స్పీడ్ అయితే 82 కిలోమీటర్లు వెళ్లగలదు. 


TVS iQubeకు చెందిన మూడు వేరియంట్ల బుకింగ్, డెలివరీ ప్రస్తుతం ప్రారంభమైంది. టీవీఎస్ కంపెనీకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఎలక్ట్రిక్ స్కూటీలకు మంచి ఆదరణ లభిస్తుందని అంచనా ఉంది. ఈ స్కూటీలు చూడ్డానికి కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. 


Also read: New Maruti Swift vs Tata Altroz: టాటా ఆల్ట్రోజ్ వర్సెస్ న్యూ మారుతి స్విఫ్ట్ మధ్య తేడా, ఫీచర్లు, ధర ఎంత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook