New Maruti Swift vs Tata Altroz: భారతదేశ మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌యూవీ, మిడ్ సైజ్ ఎస్‌యూవీ క్రేజ్ నడుస్తోంది. హ్యాచ్‌బ్యాక్ కార్లకు దాదాపు ఆదరణ తగ్గిపోయినా కొన్ని కార్లంటే ఇంకా కస్టమర్లు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటీ కార్లలో ఒకటి మారుతి సుజుకి స్విఫ్ట్. అందుకే మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్తగా మరో మోడల్ లాంచ్ చేసింది. మారుతి సుజుకి నుంచి కొత్తగా వచ్చిన న్యూ మారుతి స్విఫ్ట్ టాటా ఆల్ట్రోజ్‌తో పోటీ పడుతోంది. టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్, పెట్రోల్-సీఎన్జీ, డీజిల్ వేరియంట్లలో లభిస్తోంది. మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఏకైక హ్యాచ్‌బ్యాక్ కారు ఇదే. దీనికి పోటీగా న్యూ మారుతి స్విఫ్ట్ లాంచ్ అయింది. ఈ రెండు కార్ల ఫీచర్లు, ఇంజన్, ధర వివరాలు పరిశీలిద్దాం.
న్యూ మారుతి స్విఫ్ట్
న్యూ మారుతి స్విఫ్ట్‌లో 15 ఇంచెస్ ఎల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ లైటింగ్ హెడ్‌ల్యాంప్స్, న్యూ హనీక్రాంబ్ గ్రిల్ ఉన్నాయి. ఈ కారు మొత్తం 9 రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ కారులో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ కూడా ఉంది. సేఫ్టీ విషయంలో ఇందులో తొలిసారిగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈబీడీ విత్ ఏబీఎస్, ఐసోఫిక్స్ సీట్ యాంకర్ పాయింట్స్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ కెమేరా, హిల్ హోల్డ్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్విఫ్ట్ కేబిన్‌లో రీ డిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్, ఎయిర్‌కాన్ వెంట్స్ ఉన్నాయి. అన్నింటికంటే కీలకమైన మార్పు ఫ్లోటింగ్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండటం. ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నేవిగేషన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉన్నాయి.
టాటా ఆల్ట్రోజ్
ఇది కూడా హ్యాచ్‌బ్యాక్ వెర్షన్. ఇందులో ప్రోజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ కారు డిజైన్ స్పోర్టీ లుక్‌లో ఉంటుంది. చాలామంది టాటా ఆల్ట్రోజ్‌ను మారుతి సుజుకి బలేనోతో పోలుస్తారు. కానీ ఇప్పుడు లాంచ్ అయింది కొత్త స్విఫ్ట్ కాబట్టి టాటా ఆల్ట్రోజ్‌తో పోటీ పడుతోంది. టాటా ఆల్ట్రోజ్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 7 ఇంచెస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ క్రూయిజ్ కంట్రోల్, వాయిస్ యాక్టివేషన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్లు ప్రత్యేకం. సేఫ్టీ కోసం ఈ కారుకు 5 స్టార్ రేటింగ్ ఉంది.
న్యూ మారుతి స్విఫ్ట్‌లో 1.2 లీటర్ 3 సిలెండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 82 పీఎస్ పవర్, 112 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్ , ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. ఈ కారు మైలేజ్ అత్యధికంగా 25.75 కిలోమీటర్లు ఇస్తుంది. ఈ కారు ధర 6.49 లక్షల నుంచి ప్రారంభమౌతుంది.
ఇక టాటా ఆల్ట్రోజ్‌లో త్రిబుల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. 1.2 లీటర్ ఎన్ఏలో 87 బీహెచ్‌పి, 115 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తే, 1.2 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 108 బీహెచ్‌పి, 140 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇక 1.5 లీటర్ 4 సిలెండర్ డీజిల్ కూడా ఉంది. ఈ కారు ధర 6.65 లక్షల నుంచి ప్రారంభమై 10.80 లక్షల వరకూ ఉంటుంది.
Also read: New Maruti Swift: కొత్త మారుతి స్విఫ్ట్ లాంచ్, ఏ వేరియంట్ ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook