Two Numbers One Sim: మొబైల్ లో వాడే ఒక సిమ్ కు ఒకే నంబర్ ఉంటుంది. కానీ, ఒకే సిమ్ తో రెండు నంబర్లను వినియోగించవచ్చని ఎప్పుడైనా విన్నారా? అవును, మీరు విన్నది నిజమే.. ఒక చిట్కాతో ఒకే సిమ్ పై రెండు నంబర్లను వినియోగించవచ్చు. అయితే అందుకోసం మీరు ఏ విధంగానూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆ ట్రిక్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకే సిమ్ కార్డుతో రెండు నంబర్లు..


మీ మొబైల్ లో ఒకే సిమ్ కార్డుతో రెండు నంబర్లను యాజ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే అందుకు కావాల్సిన ట్రిక్ ఎలానో మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ట్రిక్ ను పాటించేందుకు మీ దగ్గర ఓ స్మార్ట్ ఫోన్ ఉండాలి. దాంతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండాలి. ఓ యాప్ ను మీ స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేయడం వల్ల ఒకే సిమ్ పై రెండు నంబర్లను వినియోగించవచ్చు. 


దాని కోసం ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లోని Google Play Store నుంచి 'Text Me: Second Phone Number' అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ Gmail ఖాతా సహాయంతో ఈ యాప్‌లో సైన్-అప్ చేసి ఖాతాను సృష్టించుకోవాలి. అందులో మీరు వినియోగించాల్సిన రెండు నంబర్లను టైప్ చేయాలి.   


Also Read: Diesel Price Hike: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. మరో రూ.25 పెరిగిన లీటర్ డీజిల్ ధర!


Also Read: Netflix: నెట్‌ఫ్లిక్స్ 'స్కిప్ ఇంట్రో'.. ఈ ఒక్క ఆప్షన్‌తో ఎంత సమయం ఆదా అవుతోందో తెలిస్తే షాకవుతారు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook