ఆధార్ కార్డు యూజర్లకు అతి ముఖ్యమైన సమాచారమిది. ఇకపై ఆధార్ కార్డు డౌన్‌లోడ్ మరింత సులభతరమైంది. ఇంతకుముందులా క్లిష్టతరం కాదు. చాలా సులభంగా ఆధార్ కార్డును యూఐడీఏఐ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ ఈ ప్రకటన చేసింది. ఇక నుంచి రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సమాచారం ఆధార్ కార్డు యూజర్లకు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ఎలా


ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి..మై ఆధార్ ట్యాప్ చేయాలి. తరువాత ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ స్థానంలో 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేయవచ్చు. ఆ తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండా కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే..నా మొబైల్ నెంబర్ ధృవీకరణ కాలేదు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మీరిచ్చిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే కొత్త పేజ్‌కు రీడైరెక్ట్ అవుతారు. 


రీప్రింటింగ్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఆధార్ కార్డు ప్రింట్ ప్రివ్యూ కన్పిస్తుంది. చివరిగా మేక్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. దాంతో మీ కార్డు డౌన్‌లోడ్ పూర్తయినట్టే.


Also read: Tata Share: నెలరోజులుగా పెరుగుతూ.. 52 వారాల గరిష్ట ధర దాటిన టాటా కంపెనీ షేర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook