Unemployment Rate In India: దేశంలో నిరుద్యోగ రేటు ఎంత? ఏ రాష్ట్రంలో అత్యధికం?
Unemployment Rate In India: దేశంలో నిరుద్యోగ రేటు గడిచిన ఏడేళ్లలో 22 శాతం పెరిగినట్లు తెలిసింది. హరియాణాలో అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. రాజస్థాన్ రెండోస్థానంలో ఉంది.
Unemployment Rate In India: దేశంలో కరోనా తర్వాత భారీగా నిరుద్యోగం పెరిగిపోయిందని అనేక సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయి. తాజాగా రాష్ట్రాల వారీగా నిరుద్యోగ గణాంకాలు వెలవడ్డాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) ఈ గణాంకాలను వెల్లడించింది. 2021 సెప్టెంబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి లెక్కలను ప్రకటించింది ఈఎంఐఈ.
సర్వే ప్రకారం.. హరియాణాలో అత్యధికంగా 25.78 శాతం నిరుద్యోగ రేటు ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ 24.5 శాతంతో రెండో స్థానంలో నిలించింది.
ఇక అత్యల్ప నిరుద్యోగ రేటు ఉన్నరాష్ట్రంగా ఒడిశా అగ్రస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 1.47 శాతం మాత్రమ నిరుద్యోగ రేటు ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఒడిశాలో కార్మికుల భాగస్వామ్యం 39.6 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది.
ఇక నిరుద్యోగ విషయంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపిందర్ యాదవ్ పార్లమెంట్లో కూడా ఓ ప్రకటన చేశారు. దేశంలో గడిచిన ఏడేళ్లలో నిరుద్య రేటు 22 శాతం పెరిగిందని పేర్కొన్నారు. లేబర్ బ్యూరో సర్వే ప్రకారం ఈ గణాంకాలు వెల్లడించారు. రాజ్య సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరణ ఇచ్చారు.
పీరియాడిక్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం.. దేశంలో 15-40 ఏళ్ల వయసున్న గ్రాడ్యుయేషన్స్లో ఉద్యోగం కోసం ఎదురుచూసే వారు తగ్గినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇక దేశంలో ఐటీ, ఆరోగ్య, విద్యా రంగాల్లో ఉద్యోగ అకవాశాలు పెరిగాయని కార్మిక శాఖ మంత్రి భూపిందర్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన వివిధ ఉపాధి కార్యక్రమాలు ఇందుకు తోడ్పడినట్లు వెల్లడించారు.
Also read; Birbhum Violence: రణరంగంగా మారిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ.. నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్
Also read: Trade Unions Strike: దేశవ్యాప్తంగా ఇవాళ కార్మికుల సమ్మె, బ్యాంకులకు సెలవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook