Union Budget 2023 Expectations: బడ్జెట్‌కు అంతా సిద్ధం, నిర్మలమ్మ పద్దుపై ప్రజలు ఏం ఆశిస్తున్నారు, దేశం ఏం కోరుతోంది
Union Budget 2023 Expectations: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాస్సేపట్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌కు సర్వం సిద్దమైంది. 2024 ఎన్నికలకు ముందు వస్తున్న చివరి సంపూర్ణ బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్‌లో ఏయే అంశాలకు ప్రాధాన్యత ఉండనుందో తెలుసుకుందాం..
2024 ఎన్నికలతో పాటు ఈ ఏడాది 9 రాష్ట్రాల ఎన్నికలున్నాయి. మరోవైపు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆర్ధిక మాంద్యం. ఈ క్రమంలో ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దే ఏర్పాటు ఉంటుందా లేదా ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని జనాకర్షక బడ్జెట్ ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది.
కేంద్ర ప్రభుత్వానికి ఈసారి బడ్జెట్ చాలా సవాలు విసురుతోంది. కారణం ఓ వైపు తరుముకొస్తున్న ఆర్ధిక మాంద్యం మరోవైపు ముంచుకొస్తున్న ఎన్నికలు. ఎటువైపు మొగ్గాలో తెలియని పరిస్థితి. ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తి కల్గిస్తోంది. దేశంలోని వివిధ వర్గాల్ని సంతృప్తిపర్చే వరాలు అందిస్తూనే ఆర్ధిర రంగాన్ని పటిష్టం చేసేందుకు జాగ్రత్తగా ప్రతిపాదనలు చేయాల్సి ఉంటుంది. పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌లో నెలకొన్న ఆర్ధిక సంక్షోభాలన్ని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకోవల్సి ఉంటుందనేది నిపుణుల సూచన.
కరోనా మహమ్మారి ప్రభావంతో దాదాపు రెండేళ్ల అనంతరం కోలుకున్న తరువాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపంలో సంక్షోభం వెంటాడింది. మరోవైపు చైనా నుంచి ఎప్పటికప్పుడు కవ్వింపులు ఉండనే ఉన్నాయి. ఇక దేశంలో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం ప్రజల్ని కష్టాలపాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్ని బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది. అటు సంక్షేమం ఇటు ఆర్దిక రంగ పటిష్టత రెండూ కావల్సిందే. మరోవైపు మధ్య తరగతి ప్రజలు ఈసారి బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రపంచ ఆర్ధిక మాంద్యం పరిస్థితి, వివిధ పరిణామాల ప్రభావం మధ్య తరగతి ప్రజలపై ఎక్కువగా పడుతోంది. వార్షికాదాయం 5-10 లక్షల మద్య ఉన్న ప్రజలపై ద్రవ్యోల్బణం ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే వర్గ ప్రజలు ఆదాయపు పన్ను మినహాయింపును కోరుకుంటున్నారు. 2014 తరువాత పెరగని ఆదాయపు పన్ను పరిమితి పెంచాలనేది సర్వత్రా విన్పిస్తున్న డిమాండ్. మధ్య తరగతి ప్రజల్ని ఆకట్టుకునేందుకు తయారీ, మౌళిక సదుపాయాల రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పన చేపట్టాల్సి ఉంది.
ఇక రైతాంగం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి యోజనను పెంచవచ్చని తెలుస్తోంది. అంటే ఈసారి నుంచి ఏడాదికి 6 వేలకు బదులు 8 వేలు అందించవచ్చు. వరుసగా మూడవసారి విజయం సాధించాలనుకుంటున్న ప్రధాని మోదీ..పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook