ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాల ప్రభావంతో పెట్రోల్-డీజిల్ ధరలతో పాటు ఎల్పీజీ గ్యాస్ ధరలు కూడా తగ్గనున్నాయని తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు భారీ ఉపశమనం కల్గించింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఆయిల్ కంపెనీలకు ఉపశమనం కల్గించే నిర్ణయం తీసుకుంది. ఏకంగా 22 వేల కోట్ల రూపాయలు వన్ టైమ్ గ్రాంట్‌ను ఆయిల్ కంపెనీలకు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. పెరిగిన గ్యాస్ ధరల్నించి ఉపశమనం కల్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ భేటీ కంటే ముందు పెట్రోలియం శాతం 30 వేలకోట్ల రూపాయల సబ్సిడీ కోరింది. ఎందుకంటే వంట గ్యాస్ రీటైల్ విక్రయాలపై ఆయిల్ కంపెనీలకు నష్టం చేకూరుతుంది. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు ఈ గ్రాంట్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 


స్థిరంగా వంట గ్యాస్ ధరలు


ఈ నెలలో జరిగిన ఆయిల్ కంపెనీల భేటీలో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరను 25.50 రూపాయలు తగ్గించారు. ఫలింగా ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలెండర్ ధర 1885 రూపాయల్నించి 1859.50 రూపాయలైంది. మొత్తం ఏడాదిలో పరిశీలిస్తే గ్యాస్ ధరల్లో 494.50 రూపాయలు సిలెండర్‌కు తగ్గింది. అక్టోబర్ నెలలో ఎల్పీజీ సిలెండర్ ధరల్లో ఏ విధమైన మార్పు చేయలేదు. ప్రస్తుతం వంట గ్యాస్ సిలెండర్ ధర 1053 రూపాయలుంది. 


Also read: Railway Bonus: రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక, 78 రోజుల జీతం బోనస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook