Old or New Tax Can Select by the Individual Taxpayers: మీరు ఉద్యోగస్థులతే ఈ న్యూస్ మీ కోసమే. ఇన్‌కంటాక్స్ శాఖ తరపున ఉద్యోగస్థులు, కంపెనీలకు కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఉద్యోగులకు ఏ ట్యాక్స్ విధానం నచ్చుతుందనేది కంపెనీలు అడగాల్సి ఉంటుంది. ఉద్యోగి అభీష్టం ప్రకారమే టీడీఎస్ చేయాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లకు ఎంచుకునే ఆప్షన్


ఆదాయపు శాఖ తరపున జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఒకవేళ ఉద్యోగి ట్యాక్స్ విధానంలో తన ఆప్షన్ చెప్పకపోతే 2023-24 ఆర్ధిక సంవత్సరానికి కొత్త ట్యాక్స్ విధానం ప్రకారం టీడీఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లకు మినహాయింపు, డిడక్షన్ విషయంలో పాత, కొత్త ట్యాక్స్ విధానాల్లో నచ్చింది ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. 


న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో మినహాయింపు లేదు


ఫిబ్రవరి 1,2023 న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూ ట్యాక్స్ విధానంలో ట్యాక్స్ స్లాబ్ తగ్గించి డీఫాల్ట్ ట్యాక్స్ విధానం గురించి మాట్లాడారు. కొత్త ట్యాక్స్ విధానంలో ట్యాక్స్ తక్కువే గానీ ఏవిధమైన మినహాయింపు ఉండదు. పాత ట్యాక్స్ విధానంలో అన్ని సెక్షన్ల ప్రకారం ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది.


కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ ప్రస్థుత ఆర్ధిక సంవత్సరంలో యజమానులిచ్చే జీతంపై ట్యాక్స్ డిడక్షన్ విషయంలో స్పష్టత ఇచ్చింది. దీని ప్రకారం యజమాని ప్రతి ఉద్యోగికి తనకు నచ్చిన ట్యాక్స్ విధానం ఎంచుకునే అవకాశాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఎంచుకున్న ట్యాక్స్ విధానం ప్రకారమే టీడీఎస్ కట్ అవుతుంటుంది.


Also Read: Ration Card New Rules: ఇవాళ్టి నుంచి మారనున్న రేషన్ కార్డు నిబంధనలు.. రేషన్ ఎంత లభిస్తుంది..? మార్పులేంటి..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook