Ration Card New Rules: మారిన రేషన్ కార్డు నిబంధనలు.. రేషన్ ఎంత లభిస్తుంది..? మార్పులేంటి..?

Ration Card New Rules from 1st April 2023: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్. ఉచితంగా రేషన్ తీసుకుంటుంటే ఇక నుంచి ఇతర సౌకర్యాలు కూడా వర్తించనున్నాయి. రేషన్ కార్డుల విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 8, 2023, 10:31 AM IST
  • ఇవాళ్టి నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కొత్త మార్పులు, నిబంధనల అమలు
  • జాతీయ ఆహార భద్రతా చట్టంలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం
  • ప్రతి రేషన్ కేంద్రం వద్ద ఈపీవోఎస్ మిషన్ ఏర్పాటు తప్పనిసరి
Ration Card New Rules: మారిన రేషన్ కార్డు నిబంధనలు.. రేషన్ ఎంత లభిస్తుంది..? మార్పులేంటి..?

Ration Card New Rules from April 1st 2023: రేషన్ కార్డులకు సంబంధించి మారిన కొత్త నియమాలు, మార్పులు, చేర్పులు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఒకవేళ మీరు కూడా ఉచిత రేషన్ పొందేవారైతే..ఇతర సౌకర్యాలు కూడా వర్తించనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. అదే సమయంలో కొన్ని కొత్త నిబంధనలు చేర్చింది. 

రేషన్ కార్డు దుకాణాల వద్ద ఇక నుంచి ఒక కొత్త డివైస్ అమర్చనున్నారు. ఈ డివైస్ ద్వారా రేషన్ కార్డు హోల్డర్లకు లాభం కలగనుంది. ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ డివైస్ తప్పనిసరి. ఈ డివైస్ వల్ల రేషన్ పూర్తిగా లభిస్తుంది. ఏ విధమైన అవకతవకలకు ఆస్కారముండదు.

రేషన్ కేంద్రాల వద్ద ఈపీవోఎస్ మెషీన్ తప్పనిసరిగా మారింది. ఇది లేకుండా రేషన్ సరఫరా కాదు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం లబ్దిదారులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం కలగాల్సి ఉటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం రేషన్ కేంద్రాల వద్ద ఈపీవోఎస్ మిషన్‌ను ఎలక్ట్రానిక్ తక్కెడతో అనుసంధానం చేయించేందుకు నియమాల్లో కొన్ని మార్పులు చేసింది. 

రేషన్ నియమాలేంటి..?

జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం టీపీడీఎస్‌లో పారదర్శకతను మెరుగుపర్చడం ద్వారా చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఆహార ధాన్యాల తూకంలో సంస్కరణల ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమిది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని 80 కోట్ల మందిలో ఒక్కో వ్కక్తికి ప్రతి నెల 5 కిలోల గోధుమలు, బియ్యాన్ని కిలోకు 2, 3 రూపాయల చొప్పున సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తుంది. 

Also Read: Vontimitta Temple Srirama Kalyanam 2023: ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా రాముడి కల్యాణం

నియమాలు ఎందుకు మార్చారు..?

రేషన్ సరఫరాలో అవకతవకల్ని నివారించేందుకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లబ్దిదారులకు ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అంటే ఈపీవోఎస్ డివైస్‌ను ఎలక్ట్రానిక్ తక్కెడకు తగిలించారు. దీంతో తూకంలో అవకతవకలకు పాల్పడే అవకాశముండదు. ఇది ఆన్‌లైన్ మోడ్, ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా పనిచేస్తుంది. దీంతో పారదర్శకత మరింతగా పెరుగుతుంది. 

ప్రభుత్వం 2023లో కూడా రేషన్ కార్డు హోల్డర్లకు ఉచిత రేషన్ ఇచ్చేందుకు నిర్ణయించింది. ప్రభుత్వం తరపున ఇప్పటికే కోట్లాదిమందికి ఉచిత రేషన్ సౌకర్యం అందుతోంది. బీపీఎల్ కార్డు హోల్డర్లకు ప్రభుత్వం 2023 డిసెంబర్ వరకూ ఉచితంగా రేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.

Also Read: Aadhaar Card Updates: ఆధార్ కార్డుకు కావల్సిన అర్హతలేంటి, ఎవరెవరికి ఆధార్ కార్డు జారీ చేస్తారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News