Union Govt Slashes Windfall Tax: అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు, డీజిల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. క్రూడాయిల్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED)గా విధించిన ట్యాక్స్‌ను టన్నుకు రూ.9,800 నుంచి రూ.6,300కి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా డీజిల్ ఎగుమతులపై SAEDని లీటరుకు రూ.2 నుంచి లీటరుకు రూపాయకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF), పెట్రోల్ ఎగుమతి ట్యాక్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త ట్యాక్స్ రేట్లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన గత నిబంధనల్లో ప్రభుత్వం ముడి చమురుపై ట్యాక్స్‌ను టన్నుకు రూ.9,050 నుంచి రూ.9,800 కు పెంని విషయం తెలిసిందే. డీజిల్ ఎగుమతులపై ట్యాక్స్ లీటరుకు సగానికి తగ్గించి రూ.2కి తీసుకువచ్చింది. అయితే జెట్ ఇంధనంపై లెవీ తొలగించింది. ఇది లీటరుకు రూపాయి నుంచి జీరోకు తీసుకువచ్చింది. అయితే గత మార్పుల తరువాత అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెలలో ఇప్పటివరకు మన దేశం ద్వారా దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు యూఎస్‌ డాలర్ 84.78. ఈ సగటు అక్టోబర్‌లో బ్యారెల్‌కు యూఎస్ డాలర్ 90.08 గా ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ట్యాక్స్‌ తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది.


గతేడాది జూలై 1న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. ఇంధన కంపెనీల సూపర్‌నార్మల్ లాభాలపై ట్యాక్స్‌ విధించే ప్రపంచ ధోరణికి అనుగుణంగా ఉంది. మొదట అమలు చేయడం ప్రారంభించినప్పుడు పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) రెండింటిపై లీటరుకు రూ.6 ఎగుమతి సుంకం విధించింది. డీజిల్‌పై లీటరుకు 13 రూపాయలుగా నిర్ణయించింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై ట్యాక్స్‌కు రూ.23,250 (బ్యారెల్‌కు USD 40) విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ కూడా విధించింది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ట్యాక్స్ రేట్లను కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది.


Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం


Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి