Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

Mahendragiri Vaarahi: యువకుడు సినిమాతో మనకు పరిచయమై ఆ తరువాత సత్యం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్. ఈ మధ్య సీతారామమ్ సినిమాలో కూడా ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించి మెప్పించారు. కాగా ఇప్పుడు సుమంత్ హీరోగా ఒక సినిమా ప్రారంభమైంది. మరి ఆ సినిమా వివరాలను ఒకసారి చూసేద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2023, 06:47 PM IST
Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

Mahendragiri Vaarahi: అక్కినేని కాంపౌండ్ హీరోల్లో మంచి పేరు ఉండే హీరో సుమంత్. వైవిద్యమైన పాత్రలు ఎంచుకుంటూ.. తనదైన మెస్మరైజింగ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. కాగా ఇప్పుడు సుమంత్ తన కొత్త చిత్రం ప్రారంభించారు. రాజశ్యామల బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెంబరు - 2 గా తెరకెక్కపోతున్న ఈ సినిమాకి పేరు ఖరారైంది. రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సమక్షంలో ఈ సినిమా పేరుని ఖరారు చేశారు చిత్ర యూనిట్. మహేంద్రగిరి వారాహి అనే పేరుతో సినిమాను విడుదల చేయనున్నట్లు  ప్రకటించారు. 

ఈ మేరకు చిత్ర బృందం మంగళవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించింది. హీరో సుమంత్‌, హీరోయిన్‌ మీనాక్షి, నిర్మాతలు కాలిపు మధు, ఎం సుబ్బారెడ్డి చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్‌, తదితరులు అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. వీరందరూ రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పూజలు చేసి, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసారు. 

 రాజశ్యామల అమ్మవారితో వారాహి అమ్మవారికి ఉన్న అనుబంధం గురించి చిత్ర బృందం స్వాత్మానందేంద్ర స్వామిని అడిగి తెలుసుకుంది. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు. అందువల్లనే ఈ సినిమాకి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నామని అన్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం జూన్‌ నెలలో  ప్రారంభమైందని, త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని తెలియజేశారు. మహేంద్రగిరి వారాహి చిత్ర ఇతివృత్తాన్ని స్వరూపానందేంద్ర స్వామికి వివరించి ఆశీస్సులు అందుకున్నామని అన్నారు. 

ఆ తరువాత నిర్మాతలు మాట్లాడుతూ.. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ కింద చిత్రీకరిస్తున్న సినిమాల్లో మహేంద్రగిరి వారాహి రెండవ చిత్రమని  తెలిపారు. రాజశ్యామలని నిత్యం ఉపాసించే తాను అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసం ఇక్కడకు రావడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.  ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించిన తరువాత  మళ్ళీ విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శిస్తామని తెలియజేశారు.

Also Read: CM Jagan: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఒక్కొక్కరికి రూ.లక్షన్నర వరకు..!

Also Read: Revanth Reddy: మీ ఆత్మగౌరవాన్ని ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో తాకట్టు పెట్టకండి: రేవంత్ రెడ్డి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News