How To Apply Jan Aushadhi Kendra: మీరు బిజినెస్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా..? తక్కువ పెట్టుబడితో ఎక్కువగా రిస్క్‌లేని వ్యాపారం ఏముందని ఆలోచిస్తున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్. మీరు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో నెలకు రూ.50 వేల వరకు సంపాదించుకోవచ్చు. జన్ ఔషధి కేంద్రాలను ఓపెన్ చేయడానికి పీఎసీఎస్‌ కమిటీలకు సహకార మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల్లో తక్కువ ధరలకే మెడిసిన్స్, వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను ఓపెన్ చేయడానికి 2 వేల ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు (పీఎసీఎస్) కమిటీలకు కేంద్రం ఆమోదం తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది ఆగస్టు నాటికి సుమారు దేశవ్యాప్తంగా వెయి జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 1000 కేంద్రాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఓపెన్ చేస్తున్నట్లు తెలిపింది. సహకార మంత్రి అమిత్ షా, రసాయనాలు, ఎరువుల మంత్రి మన్సుఖ్ మాండవియా మధ్య జరిగిన భేటీలో జన్ ఔషధి కేంద్రాలను ఓపెన్ చేయడానికి పీఏసీఎస్ కమిటీలను అనుమతించాలని నిర్ణయించారు. మీరు కూడా జన్ ఔషధి కేంద్రాన్ని ఓపెన్ చేసి.. ప్రతి నెలా రూ.50 వేల వరకు సంపాదించవచ్చు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా అందుతుంది. 


జన్‌ ఔషధి కేంద్రాలను తెరవడానికి దేశవ్యాప్తంగా 2 వేల పీఏసీఎస్ కమిటీలను ఎంపిక చేయనున్నారు. పీఏసీఎస్ సొసైటీల ఆదాయాన్ని.. ఉపాధి అవకాశాలను పెంపొందించడమే కాకుండా తక్కువ ధరకే ప్రజలకు ఔషధాలు అందుబాటులోకి రానున్నాయని సహకార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సరసమైన మందులను విక్రయించే 9,400 పైగా.. జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ కేంద్రాల ద్వారా దాదాపు 1,800 మందులు, 285 వైద్య పరికరాలను విక్రయిస్తున్నట్లు పేర్కొంది.


జన్ ఔషధి కేంద్రంలో లభించే మందుల ధరలు బయట మార్కెట్‌లో లభించే బ్రాండెడ్ మందుల కంటే 50 నుంచి 90 శాతం తక్కువ రేటుకే లభిస్తాయి. జన్ ఔషధి కేంద్రాన్ని ఓపెన్ చేయడానికి.. దరఖాస్తుదారు కనీసం 120 చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.5 వేలు ఉంటుంది. 


ఇలా దరఖాస్తు చేసుకోండి..


==> అధికారిక వెబ్‌సైట్‌ http://janaushadhi.gov.in/ లోకి వెళ్లండి.
==> హోమ్ పేజీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> 'అప్లై ఫర్ కేంద్ర' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి
==> మీ లోకేషన్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోండి
==> రాష్ట్రం, జిల్లా ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు.
==> తరువాత మీ పేరు, మొబైల్ నంబరు వివరాలతో రిజిస్టర్ అవ్వండి
==> యూజర్, ఐడీ పాస్‌వర్డ్ క్రియేట్ అవుతుంది.
==> లాగిన్ అయిన తరువాత మీకు బ్యాంక్ వివరాలు కనిపిస్తాయి
==> ఇక్కడ ఇచ్చిన బ్యాంక్‌లో రూ.5 వేలు నగదు జమ చేసి.. ట్రాన్స్‌క్షన్‌ ఐడీని తీసుకోండి
==> ఆ తరువాత అన్ని వివరాలను నింపి.. దరఖాస్తు చేసుకోండి.


Also Read: Whatsapp Tricks: ఈ ట్రిక్‌తో వాట్సాప్‌లో రహాస్యంగా మెసేజ్‌లు చదివేయండి.. సరదాగా చాటింగ్ చేయండి  


ముఖ్య గమనిక: జన్ ఔషధి కేంద్రాల పేరుతో ఫేక్ వెబ్‌సైట్లు క్రియేట్ చేసి ఆన్‌లైన్ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. అంతేకాకుండా జన్ ఔషధి కేంద్రాలను ఓపెన్ చేయిస్తామంటూ అధికారులు, ఏజెంట్లు అంటూ ఫోన్ కాల్స్‌ చేసి డబ్బులు డిపాజిట్ చేయమని మోసం చేసే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటికి అసలు స్పందించకండి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే 1800 180 8080 నంబరుకు కాల్ చేయండి. అధికారిక వెబ్‌సైట్‌లోనే వివరాలు తెలుసుకోండి. మోసాలకు దూరంగా ఉండండి.


Also Read:  Shubman Gill Dating: మరో భామతో శుభ్‌మన్ గిల్ రొమాంటిక్ డేటింగ్.. నెట్టింట వీడియో వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook