మీరు నిత్యం లేదా తరచూ జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తుంటే ఈ వార్త మీకోసమే. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే పాసెంజర్లకు ఎప్పటికప్పుడు సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పుడు ఫాస్టాగ్ అవసరం లేని మరో విధానాన్ని ప్రవేశపెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేషనల్ హైవే ప్రయాణాల్ని సురక్షితం చేసేందుకు, టోల్ గేట్ల వద్ద నిరీక్షణ లేకుండా చూడటం, ట్రాఫిక్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త విధానాల్ని, సౌకర్యాల్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఇక నుంచి ఫాస్టాగ్ లేకుండా మరో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాల్ని వెల్లడించారు. వాహనదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని..టోల్‌గేట్ల వద్ద పెద్ద పెద్ద క్యూలను నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధానాలు ప్రవేశపెడుతోంది. గతంలో ఉండే టోల్‌గేట్ల వద్ద డబ్బులు వసూలు చేసే విధానాన్ని ఎత్తివేసి..ఫాస్టాగ్ ప్రవేశపెట్టారు. ఫాస్టాగ్ విధానంతో టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్ చాలావరకూ నియంత్రితమైంది. ఇప్పుడు ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ సౌకర్యం ప్రవేశపెడుతోంది. అంటే ఇకపై టోల్‌గేట్ల పాత్ర దాదాపుగా పోతుంది. 


మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ నుంచి లభిస్తున్న సమాచారం మేరకు ప్రభుత్వం ప్రస్తుతం కీలక విషయాల్లో కొత్త టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తోంది. ఆ తరువాత టోల్ సౌకర్యాలపై మోటార్ వాహన చట్టంలో సవరణ చేయవచ్చు. టోల్ సౌకర్యం ప్రస్తుతం ఫాస్టాగ్ రూపంలో అమల్లో ఉంది. త్వరలోనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు  గ్రీన్ ఫీల్డ్, ఎక్స్‌ప్రెస్ వేలు, జాతీయ రహదారులకు అనుమతి లభించవచ్చు.


జీపీఎస్ ఆధారిత ప్రాజెక్టు ప్రారంభించడంలో చాలా వెసులుబాటు, సౌకర్య ముంటాయి. అంతకంటే ముందు ఈ టెక్నాలజీకు సిద్ధమం కావాలి. టెక్నికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా రోడ్ల అభివృద్ధి జరగాల్సి ఉంది. దాంతోపాటు జీపీఎస్ ఆధారిత టోల్ ప్రవేశపెట్టాలంటే ముందు మోటార్ వాహన చట్టంలో సవరణలు చేయాలి. టోల్ ప్లాజా అవసరాల్ని తొలగించేందుకు జీపీఎస్ ఆధారిత టోలింగ్ వ్యవస్థకు మరి కాస్త సమయం పట్టవచ్చు. కొత్త విధానం ప్రకారం ఏదైనా వాహనం జాతీయ రహదారిపై ఎంటర్ అయిన తరువాత ప్రయాణించే దూరాన్ని బట్టి ఆ వాహనానికుండే జీపీఎస్ ఆధారంగా లెక్కగట్టి..అందుకు తగిన టోల్ ఆటోమేటిక్‌గా సంబంధిత వ్యక్తి బ్యాంకు ఎక్కౌంట్ నుంచి కట్ అవుతుంది. 


Also read: Petrol-Disel Price: పెట్రోల్-డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో చెప్పిన కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook