Upcoming Mid Size SUV Cars 2023 in India: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్ సైజ్ ఎస్‌యూవీలలో 'హ్యుందాయ్ క్రెటా' ఒకటి. ఇప్పటివరకు 8.3 లక్షల హ్యుందాయ్ క్రెటా యూనిట్లు అమ్ముడయ్యాయి. జనవరి 2023లో హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు భారీగానే ఉన్నాయి. గత నెలలో ఈ కారు యొక్క 15 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే పాపులర్ అయిన హ్యుందాయ్ క్రెటాకు త్వరలో కష్టాలు మొదలు కానున్నాయి. కారణం ఏంటంటే.. భారత మార్కెట్లోకి రెండు కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీలు రానున్నాయి. ఆ వివరాలు ఓసారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 Kia Seltos Facelift:
ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్ సైజ్ ఎస్‌యూవీలలో కియా సెల్టోస్ రెండవ స్థానంలో ఉంది. కియా సెల్టోస్ నుంచి హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఎదురవుతోంది. 2019లో లాంచ్ అయినప్పటి నుంచి కియా కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారు సెల్టోస్. ఇప్పుడు ఇదే కారు కొత్త అవతార్‌లో రాబోతుంది. ఇది పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా మరియు రియర్ ఎండ్‌ను కలిగి ఉంటుంది.


కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ 2023 జూన్‌లో మార్కెట్లోకి రానుంది. ఇది కొత్త 1.5-లీటర్ నాలుగు-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది దాదాపు 160 PS పవర్ మరియు 253 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌లను కూడా కొనసాగిస్తుంది.


Honda Mid Size SUV:
కియాతో పాటు హోండా కంపెనీ మిడ్ సైజ్ ఎస్‌యూవీని కూడా తీసుకురాబోతోంది. కంపెనీ ఒక నెల క్రితం ఈ విషయాన్ని తెలిపింది. ఈ వేసవిలో దీనిని ప్రారంభించవచ్చు. మిడ్-సైజ్ ఎస్‌యూవీ అమేజ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని డిజైన్ నూతన WR-V మాదిరి ఉండనుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ బలమైన హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వబడుతుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను కలిగి ఉంటుంది.


Also Read: Hero Xoom 110 Scooter 2023: హీరో మోటోకార్ప్ కొత్త స్కూటర్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!  


Also Read: Balakrishna on Nurses: నేను నర్సులను ఏమీ అనలేదు..వక్రీకరించారు, వివాదంపై బాలయ్య క్లారిటీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.