UPI Rules: నిత్య జీవితంలో భాగంగా మారిపోతున్న యూపీఐ చెల్లింపుల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని ఇప్పటికే అమల్లోకి రాగా, మరికొన్ని ఇవాళ్టి నుంచి అమలు కానున్నాయి. యూపీఐలో వచ్చిన మార్పుల్ని తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ స్థూలంగా చెప్పుకోవాలంటే యూపీఐ. ఇటీవలి కాలంలో యూపీఐ వినియోగం బాగా పెరిగింది. రోజూ కోట్లాది రూపాయలు యూపీఐ విధానంలో చెల్లింపులు జరుగుతున్నాయి. యూపీఐ చెల్లింపుల్ని మరింత సరళీకృతం చేసేందుకు, మెరుగ్గా మార్చేందుకు ప్రభుత్వం కొన్ని మార్పుల్ని చేసింది. ఇక నుంచి ఏడాది కాలంగా వినియోగంలో లేని యూపీఐ ఐడీలను తొలగిస్తామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంటే ఇకపై మీ ఫోన్‌లో గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ పే వంటి యాప్స్ ఉంటే అవి వినియోగంలో ఉండాలి. లేకుంటే అవి డీయాక్టివేట్ కాగలవు. తిరిగి వినియోగించాలంటే యాక్టివేట్ చేసుకోవల్సి వస్తుంది.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే అంటే డిసెంబర్ 5 వతేదీ 2023 నుంచి విద్యా, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల నిమిత్తం యూపీఐ లావాదేవీల పరిమితిని 5 లక్షలకు పెంచింది. రోజూవారీ సాధారణ చెల్లింపుల్ని లక్ష రూపాయలకు పెంచింది. ఇక ఆన్‌లైన్ వ్యాలెట్ల ద్వారా ప్రీ పెయిడ్ చెల్లింపులు 2 వేలు దాటితే ఆ లావాదేవీలపై 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్ ఫీజు వర్తించనుంది. అయితే ఇది అందరు వ్యాపారులకు వర్తించదు. దీంతోపాటు ఆన్‌లైన్ చెల్లింపుల మోసాల్ని తగ్గించేందుకు పరిమితి విధించనుంది. గతంలో ఎప్పుడూ లావాదేవీలు జరపని వినియోగదారులకు 2 వేలు దాటి చెల్లింపు చేయాలనుకుంటే మొదటి లావాదేవీకోసం 4 గంటలు ఆగాల్సి వస్తుంది. 


ఇక అన్నింటికీ మించి త్వరలో దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలు అందుబాటులో రానున్నాయి. ఈ ఏటీఎంల ద్వారా మీరు మీ బ్యాంకు ఎక్కౌంట్ నుంచి నేరుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నగదు తీసుకోవచ్చు. ఆర్బీఐ ఇప్పటికే దీనికోసం హిటాచీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. యూపీఐ యాప్ నుంచి ఎవరికి డబ్బు పంపించినా ఇకపై పూర్తి పేరు కన్పిస్తుంది. 


యూపీఐ లావాదేవీలు సులభతరం కావడంతో రోజురోజుకూ లావాదేవీలు పెరుగుతున్నాయి. గత నెలలో 18.23 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు 12.02 వందల కోట్లు జరిగాయి. నవంబర్ నెలతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఏడాదిలో 183 లక్షల కోట్ల విలువైన117 వందల కోట్ల లావాదేవీలు జరిగాయి. 


Also read: SIP Superhit Scheme: నెలకు 1000 రూపాయల పెట్టుబడి చాలు 35 లక్షలు ఆర్జించే అవకాశం ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook