How To Money Back Wrong Payment: ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఏ రేంజ్‌లో జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రతి చిన్న లావాదేవీలకు కూడా ఎక్కువ మంది యూపీఐనే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా నోట్ల రద్దు, కరోనా తరువాత దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీస్థాయిలో పెరిగాయి. బ్యాంక్‌లు, ఏటీఎంల వద్ద క్యూలలో నిలబడే బదులు.. సింపుల్‌గా యూపీఐను ఉపయోగించి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు పొరపాటున ఇతరుల ఖాతాలోకి నగదు జమ చేస్తుంటారు. యూపీఐ ఐడీ తప్పుగా ఎంటర్ చేయడం లేదా మొబైల్ నంబరు తప్పుగా ఎంటర్ చేసినప్పుడు ఇలాంటి పొరపాటు జరుగుతుంది. ఇలా తప్పు ట్రాన్స్‌క్షన్లు జరిగినప్పుడు మీ డబ్బు పోయిందని బాధ పడాల్సిన పనిలేదు. ఈజీగా మీ డబ్బును తిరిగి పొందొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి యాప్స్ నుంచి మీరు రాంగ్ ట్రాన్స్‌క్షన్స్ చేసినప్పుడు వెంటనే ఆయా ప్లాట్‌ఫారమ్‌ల కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి. లావాదేవీ వివరాలను కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌కు వెల్లడించి.. ఫిర్యాదును నమోదు చేయండి. దీంతోపాటు మీ బ్యాంకుకు కూడా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ మార్గదర్శకాలు ప్రకారం.. తప్పుగా చెల్లింపు జరిగితే.. ఫిర్యాదు చేసిన 48 గంటలలోపు డబ్బును రీఫండ్ చేయాల్సి ఉంటుంది. అయితే లావాదేవీ జరిగిన 3 రోజులలోపు కచ్చితంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా తప్పు బ్యాంక్ ఖాతాకు చెల్లింపు జరిగినప్పుడు.. ఆర్‌బీఐ ఇచ్చిన నంబరుకు ఫిర్యాదు చేయడం మర్చిపోవద్దు. 


అనంతరం సంబంధిత బ్యాంకుకు వెళ్లి.. అక్కడ దరఖాస్తును పూరించి.. అన్ని వివరాలను అందించండి. ఒకవేళ బ్యాంక్ అధికారులు సహాయం చేయడానికి నిరాకరిస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయండి. bankingombudsman.rbi.org.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చు. అయితే ఫోన్ నుంచి లావాదేవీకి సంబంధించిన మెసేజ్‌ను డిలీట్ చేయకుండా భద్రంగా ఉంచుకోండి. అన్ని ఇతర వివరాలు, మీ ఫిర్యాదుతో పాటు అందులోని పీపీబీఎల్ నంబర్‌ను ఫిర్యాదు ఫారమ్‌లో పేర్కొనడం మర్చిపోవద్దు.


నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు రాంగ్ ట్రాన్సిక్షన్లపై ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఏ అకౌంట్‌లోకి డబ్బులు జమ చేస్తున్నారో వారి యూపీఐ ఐడీ, వారి ఫోన్ నంబర్, బదిలీ చేసిన మొత్తం వంటి వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. మీ యూపీఐ పిన్‌ను ఎంటర్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. వీటిలో ఏదైనా తప్పు జరిగితే.. డబ్బు ఇతరుల ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ చెల్లింపులు చేసే సమయంలో గుర్తు తెలియని లింక్స్‌పై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి. 


Also Read: LSG Vs MI Dream11 Team Prediction: ముంబై జోరుకు లక్నో బ్రేకులు వేస్తుందా..? ప్లే ఆఫ్స్ చేరేది ఎవరు..? డ్రీమ్ 11 టీమ్ ఇలా..  


Also Read: LSG Vs MI Updates: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. తుది జట్టులో కీలక మార్పులు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook