UPI Transactions: ఆన్‌లైన్ చెల్లింపులు అనగానే ముందుగా గుర్తొచ్చేది యూపీఐ లావాదేవీలే. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భారత్ పే, అమెజాన్ పే ఇలా ఒకటేమిటి చాలానే ఉన్నాయి. దేశంలో యూనిఫైడ్ పేస్ ఇంటర్‌ఫేస్ చెల్లింపులు అంతకంతకూ పెరగడమే ఇందుకు కారణం. గత ఐదేళ్లలో అయితే రికార్డు స్థాయిలో పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొద్దికాలంగా భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి. కరోనా మహమ్మారికి ముందే యూపీఐ చెల్లింపులు ప్రారంభమైనా మందకొడిగా ఉండేది. కేవలం 1-2 యూపీఐలే అందుబాటులో ఉండేవి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి యూపీఐల సంఖ్యతో పాటు వినిమయం కూడా భారీగా పెరిగింది. గత ఐదేళ్లలో ఎంత పెరిగిందో గణాంకాలు పరిశీలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. దేశంలో యూపీఐ లావాదేవీలు గత ఐదేళ్లలో 92 కోట్ల నుంచి 8,375 కోట్లకు పెరిగాయని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇవాళ స్వయంగా పార్లమెంట్‌లో వెల్లడించింది. 


సరిగ్గా ఐదేళ్ల క్రితం అంటే 2017-18 ఆర్ధిక సంవత్సరంలో యుపీఐ లావాదేవీలు 92 కోట్లుగా ఉన్నాయి. ఐదేళ్ల తరువాత ఇప్పుడు పరిశీలిస్తే అంటే 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఈ సంఖ్య 8,375 కోట్లకు చేరుకుంది. అంటే ఎన్నిరెట్లు పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. యూపీఐ లావాదేవీల విలువ కూడా లక్ష రూపాయలకు పెరిగింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 168 శాతం సీఏజీఆర్  139 లక్షల కోట్లుగా నమోదైంది. అదే సమయంలో 2021-22తో పోలిస్తే 2022-23 నాటికి బ్యాంకుల్లో నగదు వినిమయం 9.9 శాతం నుంచి 7.8 శాతం తగ్గిపోయింది. 


రూపే డెబిట్ కార్డుల ప్రమోట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఇన్సెంటివ్ ప్రకటించడంతో పాటు తక్కువ విలువతో భీమ్ యూపీఐ లావాదేవీలు ప్రారంభించడం ప్రధాన కారణం. మరోవైపు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు డిజిటల్ లావాదేవీల విషయంలో టార్గెట్ విధించడం మరో కారణంగా తెలుస్తోంది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ కార్యక్రమంగా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ వినిమయం పెరిగింది.


Also read: Rohit Sharma vs MI: ముంబై ఇండియన్స్ తొందరపాటు నిర్ణయానికి భారీ మూల్యం 9 లక్షలమంది అన్ ఫాలో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook