UPI ID Limit: ఒక బ్యాంక్ ఎక్కౌంట్‌పై ఎన్ని యూపీఐ ఐడీలు క్రియేట్ చేయొచ్చు, పరిమితి ఏమైనా ఉందా
UPI ID Limit: ఆన్లైన్, డిజిటల్ లావాదేవీలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింపులు జరుగుతున్నాయి. యూపీఐ టెక్నాలజీ ఇందుకు ప్రధాన కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
UPI ID Limit: యూపీఐ. యూనిఫైడ్ పేస్ ఇంటర్‌ఫేస్ అందుబాటులో వచ్చాక డిజిటల్ లావాదేవీల స్వరూపమే మారిపోయింది. ప్రతి చిన్నా చితకా వ్యాపారంలో సైతం యూపీఐ చెల్లింపులే కన్పిస్తున్నాయి. యూపీఐ టెక్నాలజీ అనేది ఓ గేమ్ ఛేంజర్‌లా మారిందంటే అతిశయోక్తి కానే కాదు.
యూపీఐ వినియోగం పెరిగే కొద్దీ సందేహాలు కూడా అధికమౌతుంటాయి. ఒక బ్యాంక్ ఎక్కౌంట్‌పై ఎన్ని యూపీఐ ఐడీలు క్రియేట్ చేయవచ్చనేది మొదటి సందేహం. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా వినియోగిస్తున్న పేమెంట్ సిస్టమ్‌గా మారింది. ఒకే ఒక మొబైల్ యాప్ ద్వారా మల్టిపుల్ బ్యాంక్ ఎక్కౌంట్స్‌ను అనుమతిస్తూ పేమెంట్ జరుపుతుంటుంది. యూపీఐ ద్వారా కస్టమర్లు, వ్యాపారుల అత్యంత సులభంగా నగదు బదిలీ, చెల్లింపులు జరుపుకుంటున్నారు.
అయితే యూపీఐ వినిమయం పెరుగుతున్న క్రమంలో ఒక బ్యాంక్ ఎక్కౌంట్‌కు ఎన్ని యూపీఐ ఐడీలు క్రియేట్ చేయవచ్చనేది ప్రధాన ప్రశ్న. దీనికి సమాధానం ఒక బ్యాంక్ ఎక్కౌంట్‌కు 4 యూపీఐ ఐడీలు క్రియేట్ చేసుకునేందుకు అనుమతి ఉండటం. నచ్చిన యూపీఐని ఇన్‌స్టాల్ చేసుకోవడం, నచ్చనిది డిలీట్ చేసుకునే వెసులుబాటు కస్టమర్లకు ఎప్పుడూ ఉంటుంది. ఒక బ్యాంక్ ఎక్కౌంట్‌పై 4 యూపీఐ ఐడీలు క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఉండటమే కాకుండా ఒకే ఎక్కౌంట్‌పై ఏకీకృత యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ పే ఎంచుకునేవారికి యూపీఐ సపోర్టెడ్ బ్యాంక్‌తో అనుసంధానం తప్పనిసరి. యూపీఐ యాప్స్‌కు వర్చువల్ పేమెంట్ అడ్రెస్ యాడ్ చేయడం అనేది కస్టమైజేషన్‌లో మరో అదనపు ప్రక్రియగా భావించాలి.
యూనిక్ ఐడెంటిఫయర్ అనేది అపరిమితమైన లావాదేవీలు జరిపేందుకు ఒకే యాప్‌కు మల్టిపుల్ బ్యాంకు ఎక్కౌంట్లు లింక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ప్రతి బ్యాంకు ఎక్కౌంట్‌కు ప్రత్యేక యూపీఐ ఐడీ ఉంటుంది. నగదు స్వీకరించేందుకు ప్రైమరీ ఎక్కౌంట్‌గా పరిగణిస్తారు. పేమెంట్ చేసేటప్పుడు కూడా కస్టమర్ ఏ బ్యాంకు ఎక్కౌంట్ ఎంచుకోవాలో ఆప్షన్ ఉంటుంది.
Also read: Rammandir New Row: రామమందిర ప్రారంభోత్సవ వివాదం, అద్వానీ-జోషిలకు నో, దేవెగౌడకు ఎస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook