Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ వేదిక వాట్సప్ మరో అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సూపర్ పవర్ లాంటిదే. ఆ ఫీచర్ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ యూజర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. అందుకే చాటింగ్ లేదా ఇన్‌ఫో షేరింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది వాట్సప్ మాత్రమే. ఇప్పటికే వాట్సప్‌లో పలు అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే వాట్సప్‌లో ఉన్న డిలీట్ ఎవ్విర్ వన్ ఫీచర్ అందరికీ చాలా ఉపయోగపడుతోంది. ఇప్పుడు దీనికి..ఎక్స్‌టెన్షన్ రానుంది. అంటే ఇక నుంచి వాట్సప్ గ్రూప్ అడ్మిన్స్‌కు సూపర్ పవర్ లభించనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..


వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు కొత్త ఫీచర్


WABetaInfo నివేదిక ప్రకారం వాట్సప్‌లో వస్తున్న కొత్త ఫీచర్ అందరి కోసం కానేకాదు. వాట్సప్ గ్రూప్ అడ్మిన్ల కోసం మాత్రమే. మీరు ఏదైనా వాట్సప్ గ్రూప్ అడ్మిన్లుగా ఉంటే ఆ ఫీచర్ మీకూ వర్తిస్తుంది. ఈ ఫీచర్ కోసం యూజర్లు చాలా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే..వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు లభించే ఈ సూపర్ పవర్  చాలా ఉపయోగపడుతుంది. ఈ పవర్ ప్రకారం గ్రూపులో ఏ సభ్యుడి మెస్సేజ్ అయినా సరే డిలీట్ ఫర్ ఎవ్విర్ వన్ చేయవచ్చు. అంటే మీరు అడ్మిన్‌గా ఉన్న గ్రూపులో ఏ సభ్యుడి మెస్సేజ్ అయినా నచ్చకపోతే మీరు ఆ మెస్సేజ్‌ను పూర్తిగా అందరికీ డిలీట్ చేసే అవకాశముంటుంది. 


ప్రస్తుతం ఈ ఫీచర్ పరిశోధన దశలో ఉంది. త్వరలోనే అందుబాటులో రానుంది. ఆ ఫీచర్ మీకు అందుబాటులో వచ్చిందో లేదో చెక్ చేసేందుకు మీరు అడ్మిన్‌గా ఉన్న గ్రూపులో ఏదైనా మెస్సేజ్‌ను లాంగ్ ప్రెస్ చేయండి. మెస్సేజ్ డిలీట్ చేసే ఆప్షన్ కన్పిస్తే ఆ ఆప్షన్ వచ్చినట్టు అర్ధం చేసుకోవచ్చు.


Also read: ITR Filing: ఇన్‌కంటాక్స్ గడువు తేదీ జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా..మిస్సైతే ఏమౌతుంది



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook