Whatsapp New Feature: కేవలం మహిళల కోసం సరికొత్త ఫీచర్ ప్రవేశపెడుతున్న వాట్సప్
Whatsapp New Feature: వాట్సప్ మరో కొత్తఫీచర్ ప్రవేశపెడుతోంది. అయితే ఈసారి అందరు యూజర్లకు కాదు సుమా. కేవలం మహిళా యూజర్లకు మాత్రమే కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆ వివరాలు చూద్దాం.
Whatsapp New Feature: వాట్సప్ మరో కొత్తఫీచర్ ప్రవేశపెడుతోంది. అయితే ఈసారి అందరు యూజర్లకు కాదు సుమా. కేవలం మహిళా యూజర్లకు మాత్రమే కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆ వివరాలు చూద్దాం.
వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు ప్రవేశపెడుతుంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెస్సెంజర్ యాప్‌గా వాట్సప్‌కు విశేష ప్రాచుర్యం లభిస్తుంటుంది. వాట్సప్ లేకుండా గడపలేని పరిస్థితి. అంతగా వాట్సప్‌లో బిజీగా ఉంటారు జనం. ఇటీవలే పేమెంట్స్ ఫీచర్ ప్రవేశపెట్టిన వాట్సప్ ఇప్పుడు కొత్తగా మరో ఫీచర్ అందుబాటులో తీసుకొస్తోంది. ఈసారి మాత్రం కేవలం మహిళల కోసమే కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది.
కొత్త ఫీచర్ కోసం వాట్సప్ సిరోనా హైజెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసింది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ ద్వారా మహిళలు నెలసరిని ట్రాక్ చేసే వెసులుబాటు కల్పిస్తోంది. మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు తీసుకొస్తోంది. కొత్త ఫీచర్ పొందేందుకు మహిళా యూజర్లు +91971886644 నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేయాలి. చాట్ బోట్ చూపించే మూడు ఆప్షన్లలో ఒకటి ఎంచుకుని..కొంత బేసిక్ సమాచారాన్ని నమోదు చేయాలి. ఇక అప్పట్నించి కచ్చితమైన నెలసరిని యూజర్‌కు రిమైండ్ చేస్తుంది ఈ ఫీచర్. నెలసరి ట్రాకింగ్‌తో పాటు గర్భధారణ, గర్భధారణ నివారణ సేవలు కూడా సిరోనా హైజెనీ సంస్థ అందిస్తుంది.
Also read: Cheapest Data Plan: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. అతి తక్కువ ధరలో ఏడాది పాటు అపరిమిత కాలింగ్, డేటా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.