Pension Scheme: ఏ పెన్షన్ స్కీమ్ బెటర్..? ఈ తేడాలు తెలుసుకోండి
New vs Old Pension Scheme: ఏ పెన్షన్ విధానం బెటర్..? ఎందులో ఎక్కువ లాభాలు ఉన్నాయి..? ఎన్‌పీఎస్, ఓపీఎస్ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటి..? ఉద్యోగులు రిటైర్మెంట్ తరువాత ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
New vs Old Pension Scheme: పదవీ విరమణ తరువాత సంతోషకర జీవితం గడపాలని.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2003లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) స్కీమ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)కు ప్రత్యామ్నాయంగా ఈ పథకం ప్రారంభించింది. ఎన్‌పీఎస్, ఓపీఎస్‌లో రెండింటిలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి..? రెండింటి మధ్య తేడా ఏంటి..?
నేషనల్ పెన్షన్ సిస్టమ్
వివిధ రకాల పెన్షన్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి వ్యక్తులను అనుమతించేందుకు ఎన్‌పీఎస్ స్కీమ్‌ను తీసుకువచ్చారు. ఈ పథకంలో 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ఎన్‌పీఎస్ కింద ప్రభుత్వం ఎటువంటి హామీ పెన్షన్‌ను అందించదు. ఇందుకు బదులుగా ఫండ్ ద్వారా వచ్చే పెట్టుబడి రాబడిపై ఆధారపడి పెన్షన్ వస్తుంది. ఈ ప్లాన్ చందాదారులకు రూ.5 లక్షల జీవిత బీమాను కూడా అందిస్తుంది.
పాత పెన్షన్ స్కీమ్
రిటైర్మెంట్ తరువాత గడిపే జీవితం, సర్వీస్ సంవత్సరాల సంఖ్య ఆధారంగా పెన్షన్ అందించే ఒక నిర్దిష్ట ప్రయోజన పథకం పాత పెన్షన్ స్కీమ్. కనీసం 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఓపీఎస్ కింద ప్రభుత్వం హామీతో కూడిన పెన్షన్‌ను అందజేస్తుంది. ఇది ఉద్యోగులు చివరగా తీసుకున్న జీతం, సర్వీస్ కాలం ఆధారంగా ఉంటుంది.
ఎన్‌పీఎస్, ఓపీఎస్ మధ్య ప్రధానంగా తేడా హామీతో కూడిన పెన్షన్. ఎన్‌పీఎస్ ఎటువంటి హామీ పెన్షన్‌ను అందించదు. అయితే ఓపీఎస్ మాత్రం చివరిగా తీసుకున్న జీతం, సర్వీస్ సంవత్సరాల సంఖ్య ఆధారంగా హామీనిచ్చే పెన్షన్‌ను అందిస్తుంది. పదవీ విరమణ తరువాత గ్యారెంటీ పెన్షన్ కోసం చూస్తున్న వారికి ఓపీఎస్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.
అదేవిధంగా ఈ రెండు పథకాల మధ్య మరో ప్రధాన వ్యత్యాసం వయోపరిమితి. ఎన్‌పీఎస్‌లో 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులకు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఓపీఎస్‌లో కనీసం 10 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇది వారి పదవీ విరమణ కోసం ప్లాన్ చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది.
పెన్షన్ కంట్రిబ్యూషన్ పరంగా ఓపీఎస్ కంటే ఎన్‌పీఎస్ మరింత అనువైనది. ఎన్‌పీఎస్ కింద వివిధ రకాల పెన్షన్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకోవచ్చు. అయితే ఓపీఎస్ కింద పెన్షన్ వ్యక్తి చివరి శాలరీ, సర్వీస్ కాలం ఆధారంగా ఉంటుంది.
Also Read: Lesbian Love Story: ప్రేమ కోసం అబ్బాయిగా మారిన అమ్మాయి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన లవర్
Also Read: Hyper Aadi: 2024లో జనసేన ప్రభుత్వం.. సినిమాటోగ్రఫీ మంత్రిగా హైపర్ ఆది.. పోస్టులు వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి