XIAOMI 12 series creates a new sales record $283 million sold in just 5 minutes in first sale : స్మార్ట్‌ ఫోన్స్‌ దిగ్గజం షావోమీ విడుదల చేసిన షావోమీ 12 సిరీస్‌ (XIAOMI 12 series) స్మార్ట్‌ ఫోన్స్ సేల్స్ లో రికార్డ్‌ సృష్టించాయి. ఐదు నిమిషాల్లోనే వేలాది కోట్ల రూపాయల విలువైన స్మార్ట్‌ ఫోన్ల అమ్మాకాలు జరిగాయి. Xiaomi 12, 12 Pro, 12Xవంటి Xiaomi 12 సిరీస్ ఫోన్స్ తాజాగా మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ విడుదలైన రోజే.. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లలో కేవలం ఐదు నిమిషాల్లో 1.8 బిలియన్ యువాన్స్ (~$283 మిలియన్) అంటే 2108 కోట్ల రూపాయల విలువైన స్మార్ట్‌ ఫోన్‌లు అమ్ముడయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూ ఇయర్ (New Year) సందర్భంగా షావోమీ.. షావోమీ 12 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లను రిలీజ్ చేసింది. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ వేదికలుగా షావోమీ 12 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. కొత్త సంవత్సరం సందర్భంగా షావోమీ.. మొదటి సారి కాంపాక్ట్‌ ఫ్లాగ్‌షిప్‌తో షావోమీ 12 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లను (smart‌ phones) రిలీజ్ చేసింది. ఈ సిరీస్‌లో అన్నీ బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్లుగానే ఉన్నాయి. షావోమీ 12తో పాటు షావోమీ 12ప్రో, 12ఎక్స్ ఫోన్లు ఈ సిరీస్ కింద రిలీజ్ అయ్యాయి. వీటన్నింటికీ కూడా బడ్జెట్‌ తక్కువగా ఉండడం అలాగే అడ్వాన్స్‌ ఫీచర్స్ ఉండడంతో యూజర్స్ అట్రాక్ట్ అయ్యారు. అలాగే న్యూ ఇయర్ సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అయింది. దీంతో కొన్ని నిమిషాల్లోనే భారీగా సేల్స్‌ జరిగాయి.


Also Read : Vaikunta Dwara Darshan: వైకుంఠ ద్వార దర్శనం కోసం సిఫారసు లేఖలు పంపొద్దు: TTD ఛైర్మన్


షావోమీ 12 స్మార్ట్‌ ఫోన్‌ 6.28 ఇంచెస్ డిస్‌ప్లేతో వస్తుంది. 12 జీబీ ర్యామ్‌తో పాటు 256 ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంటుంది. ట్రిపుల్‌ రేర్‌ కెమెరాస్ ఉంటాయి. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంటుంది. ఇక షావోమీ 12 ప్రో స్మార్ట్‌ ఫోన్ (smart‌ phone) 6.73 ఇంచెస్ డిస్‌ప్లేతో వస్తుంది. 2కే అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ట్రిపుల్‌ రేర్‌ కెమెరా ఉంటుంంది. 50 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది.


Also Read : Omicron Symptoms: ఒమిక్రాన్ సోకిన వారిలో కొత్త లక్షణాలు.. కళ్లు ఎర్రగా మారడం, జుట్టు రాలడం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి