Xiaomi 12 Ultra Fast Charging: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్‌ సంస్థ షావోమి నుంచి మరో సరికొత్త ఫోన్‌ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. షావోమి 12 అల్ట్రా పేరుతో త్వరలో కొత్త స్మార్ట్‌ ఫోన్ లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్‌లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న షావోమి 12 ఫోన్‌లో ఉండే ఫీచర్స్‌ కంటే కాస్త అదనంగా ఉండనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైకా బ్రాండెడ్ కెమెరాలతో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కెమెరా ఫీచర్స్‌ ఇప్పటికే లీక్ అయ్యాయి. అయితే షావోమి 12 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చేశాయి. టిప్‌స్టర్ డిజిటల్‌చాట్‌స్టేషన్ షావోమి 12 అల్ట్రా ఫోన్ బ్యాటరీ డిటేల్స్‌ను, ఈ ఫోన్‌కు సంబంధించిన మరికొన్ని స్పెసిఫికేషన్స్‌ బయటపెట్టింది.


షావోమి 12 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్ 4,680mAh బ్యాటరీతో రానుంది అంటూ టిప్‌స్టర్ చెప్పేసింది. అంతేకాదండోయ్.. 120వాట్స్‌ వైర్డ్‌, 50వాట్స్‌ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుందట. ఎంఐ 11 అల్ట్రా 67వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ కంటే ఇది అప్‌గ్రేడ్. ఇక ఎంఐ 10 అల్ట్రా సేమ్‌ షావోమి 12 అల్ట్రా మాదిరిగానే 120వాట్స్‌, 50వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇక షావోమి 12 ప్రో కూడా సేమ్ ఇదే ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంది. 


అంతేకాదు షావోమి 12 అల్ట్రా 2కే రిజల్యూషన్‌తో సామ్‌సంగ్‌ అమోల్డ్ ప్యానెల్‌తో రానుందని టిప్‌స్టర్ తెలిపింది. 120హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో, హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌ కర్వ్డ్ స్క్రీన్ ఈ ఫోన్‌ ఉండనుంది.


ఇక ఆప్టిక్స్ పరంగా చూస్తూ.. ఈ ఫోన్‌కు ఎంఐ 11 అల్ట్రా మాదిరిగానే కెమెరా సిస్టమ్‌ ఉంటుంది. 50ఎంపీ + 48ఎంపీ + 48మెగా పిక్సల్‌లతో ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ షావోమి 12 అల్ట్రా ఫోన్‌కు ఉంటుందంటూ టిప్‌స్టర్ పేర్కొంది. లైకా బ్రాండ్ సెన్సార్స్‌ ఉంటాయి. 


ఇక షావోమి 12 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 1 ఎస్‌ఓసీ ద్వారా రన్‌ అవుతుందని తెలుస్తోంది. అలాగే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 ఓస్‌తో బేస్డ్‌ ఎంఐయూఐ 13తో ఇది రన్ అవుతుందని తెలుస్తుంది.


Also Read: Virat Kohli Century: స్పెషల్ మ్యాచులోనూ విరాట్ కోహ్లీ చెత్త ప్రదర్శన.. నిరాశలో ఫాన్స్! సెంచరీ ఇక కలనేనా?!!


Also Read: Gujarat Titans: అహ్మదాబాద్ టైటాన్స్ కాదు.. టీమ్ పేరును ప్రకటించిన అహ్మదాబాద్ ప్రాంచైజీ!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook