Gujarat Titans: అహ్మదాబాద్ టైటాన్స్ కాదు.. టీమ్ పేరును ప్రకటించిన అహ్మదాబాద్ ప్రాంచైజీ!!

Gujarat Titans: అహ్మదాబాద్ ప్రాంచైజీ యాజమాన్యం తమ టీమ్ పేరు 'గుజ‌రాత్ టైటాన్స్' అని అధికారికంగా బుధ‌వారం ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ట్విట‌ర్‌లో 'శుభ్ ఆరంభ్' అని పోస్ట్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2022, 03:38 PM IST
  • 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 వేలం
  • అహ్మదాబాద్ టైటాన్స్ కాదు
  • టీమ్ పేరును ప్రకటించిన అహ్మదాబాద్ ప్రాంచైజీ
Gujarat Titans: అహ్మదాబాద్ టైటాన్స్ కాదు.. టీమ్ పేరును ప్రకటించిన అహ్మదాబాద్ ప్రాంచైజీ!!

Ahmedabad IPL Team named as Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనున్న ఈ వేలంలో మొత్తంగా 10 ఫ్రాంఛైజీలు పాల్గొననున్నాయి. ఇప్పటికే ఉన్న 8 జట్లతో పాటు కొత్తగా ఫ్రాంఛైజీలు అయిన లక్నో, అహ్మదాబాద్ పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో ప్రాంచైజీ తమ జట్టుకు 'లక్నో సూపర్ జెయింట్స్' అని నామకరణం చేయగా.. తాజాగా అహ్మదాబాద్ ప్రాంచైజీ కూడా తన జట్టు పేరును ప్రఙకటించింది. 

అహ్మదాబాద్ ప్రాంచైజీ యాజమాన్యం తమ టీమ్ పేరు 'గుజ‌రాత్ టైటాన్స్' అని అధికారికంగా బుధ‌వారం ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ట్విట‌ర్‌లో 'శుభ్ ఆరంభ్' అని పోస్ట్ చేశారు. అహ్మదాబాద్‌ టైటాన్స్‌ అని పేరు పెట్టినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సీవీసీ క్యాపిటల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని కలిగి ఉంది. సీవీసీ క్యాపిటల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది. అహ్మదాబాద్‌తో పాటు లక్నో ఫ్రాంచైజీ కూడా ఐపీఎల్ 2022లో తొలిసారి ఆడనున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు అహ్మదాబాద్‌ టైటాన్స్‌ హార్దిక్ పాండ్యా (15), ర‌షీద్ ఖాన్‌ (15), శుభ్‌మన్ గిల్‌ (8) కోట్లకు కోనుగొలు చేసింది. అహ్మదాబాద్‌ టైటాన్స్‌ జట్టుకు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా సారథిగా ఎంపికయిన విషయం తెలిసిందే. మెగా వేలంలో పాల్గొని మిగతా ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. అహ్మదాబాద్‌ టైటాన్స్‌ జట్టుకు ఇంగ్లండ్‌కు చెందిన విక్రమ్ సోలంకి క్రికెట్ డైరెక్టర్‌గా, టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఇక టీమిండియా మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ మెంటార్ కమ్ బ్యాటింగ్ కోచ్‌గా ఉండనున్నారు.

గతంలో గుజరాత్ జట్టు 2016, 2017లో ఐపీఎల్‌ సీజన్లో  బరిలోకి దిగిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ సస్పెన్షన్ సమయంలో పూణే, రాజ్‌కోట్ ఫ్రాంచైజీలు వచ్చాయి. రాజ్‌కోట్ ఫ్రాంచైజీ గుజరాత్ లయన్స్ పేరుతో బరిలోకి దిగింది. ఈ జట్టుకు మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ జట్టుకు రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఆడారు.

Also Read: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్‌.. యాక్సిడెంట్‌లో యువకుడిని కాపాడిన రియల్‌ హీరో!! (వీడియో)

Also Read: Kajal Aggarwal Body Shaming: ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఇదంతా మామూలే.. బాడీ షేమింగ్‌ చేసే వారికి కాజల్‌ కౌంటర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter 

Trending News