Xiaomi Assets Seizure Case: షావోమి ఇండియా భారత్ నుండి పాకిస్థాన్‌కి వెళ్లిపోతోందా ?
Xiaomi Assets Seizure Case: ఇండియాలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షావోమి ఇండియాకు చెందిన రూ. 5,551.27 కోట్ల ఆస్తులు సీజ్ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Xiaomi India's FEMA case: ఇండియాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌కి స్వస్తి చెప్పి మేక్ ఇన్ పాకిస్థాన్ అనే నినాదంతో ఇకపై స్మార్ట్ ఫోన్స్‌ని పాకిస్థాన్‌లో తయారు చేసేందుకు షావోమి ఇండియా ప్రణాళికలు రచిస్తున్నట్టు వార్తలొచ్చాయి. తమ కంపెనీలపై దాడులు చేస్తూ ఆస్తులను అటాచ్ చేస్తూ వెళ్తున్న భారత సర్కారుకు షాకిచ్చే ప్రయత్నాల్లో భాగంగానే షావోమి ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సౌత్ఏషియాఇండెక్స్ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ట్వీట్ సైతం వైరల్ అయింది.
అయితే, మేక్ ఇన్ పాకిస్థాన్ గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తలపై స్వయంగా షావోమి ఇండియా స్పందించింది. గత 8 ఏళ్లుగా షావోమి ఇండియా భారత్‌లో స్మార్ట్ ఫోన్స్ తయారుచేస్తోంది. ఇకపై కూడా ఇండియాలోనే స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తాం కానీ ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్లే ఆలోచనే లేదని షావోమి ఇండియా స్పష్టంచేసింది.
షావోమి ఇండియా పాకిస్థాన్‌లో స్మార్ట్ ఫోన్స్ తయారు చేసే ఆలోచనలో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. ఈ విషయంలో వైరల్ అవుతున్న ట్వీట్‌లో వాస్తవం లేదని షావోమి ఇండియా వెల్లడించింది. 2014లో భారత్‌లో అడుగుపెట్టిన ఏడాదిలోపే మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని అనుసరిస్తూ ఇండియాలో స్మార్ట్ ఫోన్ మేకింగ్ ప్రారంభించాం. 99 శాతం స్మార్ట్ ఫోన్స్, 100 శాతం టీవీలు ఇండియాలోనే తయారవుతున్నాయి. ఇకపై కూడా ఇక్కడే తయారవుతాయి అని షావోమి ఇండియా తేల్చిచెప్పింది.
Also Read : Flipkart Big Diwali Sale: అలాంటి ఆఫర్ మళ్లీమళ్లీ రాదు.. శామ్‌సంగ్ ఫ్లిప్, ఫోల్డ్ ధర ఎంతో తెలిస్తే షాకే!
Also Read : 5G smartphones: దేశంలో ఇక 5G సేవలు.. చీప్ అండ్ బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్ ఇదిగో
Also Read : iPhone in Rs 20,000: ఐఫోన్ ప్రియులకు బంపరాఫర్.. రూ 20 వేలకే కొత్త ఐఫోన్
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి