National Pension Scheme: ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న చాలా మంది ఇప్పటి నుంచే రిటైర్మెంట్ తరువాత ఎలా గడపాలని ఆలోచిస్తున్నారు. పదవీ విరమణ తరువాత ప్రతి నెలా కొంత పెన్షన్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మీరు ఇంకా ప్లాన్ చేసుకోకపోతే.. ఇప్పటి నుంచి అయినా ప్రతి నెల కొంత డబ్బును పొదుపు చేసుకోండి. ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టి.. రిటైర్మెంట్ తరువాత హ్యాపీగా జీవితాన్ని గడపండి. ప్రతి రోజు రూ.200 పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ తరువాత ప్రతి నెల రూ.50 వేలు పొందండి. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. వీటిలో మీరు దీర్ఘకాలిక పెట్టుబడితే మంచి రాబడిని పొందుతారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పేరుతో ప్రభుత్వం పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మీరు దీర్ఘకాలానికి డబ్బు డిపాజిట్ చేయాలి. ఈ ప్రభుత్వ పథకంలో రోజుకు రూ.200 చొప్పున ప్రతి నెలా రూ.6 వేలు వేస్తే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలకు మీకు రూ.50 వేలు వస్తాయి. ఈ పథకం కింద ఎన్‌పీఎస్ టైర్ 1, ఎన్‌పీఎస్ టైర్ 2 అనే రెండు రకాల ఖాతాలు ఉన్నాయి. పీఎఫ్ డిపాజిట్ లేని వ్యక్తులు రూ.500 డిపాజిట్ చేయడం ద్వారా టైర్ 1 ఖాతాను తెరవవచ్చు.


ప్రస్తుతం మీ వయస్సు 24 సంవత్సరాలు అయితే.. ఈ పథకం మీకు గరిష్ట ప్రయోజనాన్ని అందిస్తుంది. 24 ఏళ్ల వయస్సులో ఎన్‌పీఎస్ ఖాతాను తెరిచి.. ప్రతి నెలా 6 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. మీరు 60 సంవత్సరాల వయస్సు వరకు ఇందులో డబ్బు జమ చేయాలి. అంటే మీరు సుమారు 36 సంవత్సరాల వరకు ఇందులో డబ్బు జమ చేస్తూ ఉండాలి. 


ఆ తర్వాత ఈ మొత్తం రూ.25,92,000 అవుతుంది. మీ డిపాజిట్‌పై 10 శాతం రాబడిని ఊహించినట్లయితే.. దాని మొత్తం కార్పస్ విలువ రూ.2,54,50,906 అవుతుంది. మీరు మీ మెచ్యూరిటీ ఆదాయంలో 40 శాతం నుంచి ఎన్‌పీఎస్ యాన్యుటీని కొనుగోలు చేస్తే, రూ.1,01,80,362 మీ ఖాతాలో జమ అవుతుంది. దీనిపై 10 శాతం రాబడిని ఊహించినట్లయితే.. మీ ఖాతాలో మొత్తం డిపాజిట్ మొత్తం దాదాపు 1,52,70,000 అవుతుంది. మీరు 36 సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు.. ఎన్‌పీఎస్ నుంచి మీకు నెలకు రూ.50 వేలు పెన్షన్‌గా  వస్తుంది.


Also Read: SBI Loan Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు  


Also Read: విరాట్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన టీమిండియా.. 73 పరుగులకే  శ్రీలంక ఆలౌట్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి